పయనం

పయనం

పయనమై వచ్చారు మనుషులు ఈ లోకంలోకి

పరుగు పందెంలా చేసుకున్నారు జీవితాన్ని

ప్రతిదీ పొందాలని కోరికతో
నలుగుతున్నాడు మనిషి
ప్రతీసారి

కాలాన్ని ఆపలేమని తెలిసినా
చక్రబంధాల మధ్యన చేరి

విలువైన కాలంతో పోటీపడుతూ
విజ్ఞానపు అంచులను తాకి

అంతుచిక్కని ఆనందాలను వెతుకుతూ

అద్భుతాల సృష్టిలో అన్నీ
తెలుసుకోవాలనే తపనలో

జీవిత బాటసారి పయనం
మలుపుల గెలుపులతో

ప్రతీక్షణం పయనంలో భాగమే
అనునిత్యం అడుగు ముందుకు
ఆశ నిరాశల ఫలితమే ……?

– జి జయ

Related Posts