పేదవాడి సౌధం

పేదవాడి సౌధం

పేదవాడి సౌధం

రాత్రి పిలుపుతో….
నన్ను నేను ఆదమరచి
నీరసించిన దేహంతో
నివురుగప్పిన ప్రాణంతో
గాఢ నిద్రలోకి జారుకున్నాను.

కనిపించని కళ్ళకు కమ్మని కలల్ని అద్దుతూ
లాలనగా లాలిస్తూ జోలపాట పాడుతూ
అమ్మలా నన్ను , తన పొత్తిళ్ళలో దాచుకున్న,
ఈ రేయి నా కందించిన హాయి ..!!!
అక్షరాల కందనిది..!
మాటలకు దొరకనిది..!

నన్నావహించి దహిస్తున్న ఆకలి,..నీడలా
వెంటాడుతూ వేధిస్తున్న పేదరికం,
చల చల్లని ఈ చీకటి సౌధం ముందు
చెల్లాచెదురై చల్లారి పోయాయి.

వెచ్చని తన బాహువుల్లోకి నన్నాహ్వానిస్తూ
కనబడే కపటి వెలుగుల్ని కప్పిపెట్టి,
నా గుండె గూటిలో కొలువుతీరిన,
ఈ నల్లనమ్మ..
కంటి నిండా నిద్రనిస్తూ
కంటి రెప్పలా కాపుకాస్తూ
కలత చెందిన కళ్ళతో…
కన్నతల్లి లా ఆదరిస్తోంది.

-గురువర్ధన్ రెడ్డి

ఓర్పెంత గొప్పదో తెలుపుతూ Previous post ఓర్పెంత గొప్పదో తెలుపుతూ
చిలిపిలిపి Next post చిలిపి లిపి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close