పెద్దదిక్కు

పెద్దదిక్కు

“రాజు వెంటనే రూమ్ లోకి వెళ్లి మన బట్టల బ్యాగ్ లో పెట్టు” అని చెప్పింది అక్షిత.”అలాగే అక్క నేను ఇప్పుడే వెళ్లి సర్దుతాను” అని చెప్పాడు రాజు.
“అమ్మ నువ్వు కిచెన్ లో ఏమి ఉన్నాయో చూసి వాటితో ఉప్మా చేసి పెట్టమ్మా. నాన్న మీరు అసలే హార్ట్ పేషంట్ మీరు కూర్చొని రెస్ట్ తీసుకోండి. ఇవన్నీ మేము చూసుకుంటాం” అని చెప్పింది అక్షిత.

వారం రోజులుగా పడుతున్న వర్షం కారణంగా వరదలు వచ్చి ఇంటి లోపలికి నీళ్లు వచ్చేసాయి.ఆ నీటిలోనే తిరుగుతూ ఆ నీళ్లను బయటికి పోస్తూ ఇంట్లో వాళ్ళందరూ తాలో ఒక పనిని పంచుకుంటూ రోజులు గడుపుతున్నారు.వాళ్లున్న ఏరియాకి వరదలు వచ్చే సూచనలు ఉన్నాయి అని టీవిలో చెప్పారు.

ఆ కారణంగానే వర్షం ఎక్కువయి నీళ్ళు ఇంట్లోకి వచ్చాయి.ఇంకా వర్షం ఆగట్లేదు సరిగ్గా కరెంటు లేదు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదామంటే ఫోన్ కి ఛార్జింగ్ లేదు.
అక్షిత కుటుంబమే కాదు ఎన్నో కుటుంబాలు ఇలాగే ఇబ్బంది పడుతున్నారు.

ఎడతెగని వర్షాల వల్ల నదులు , కాలువలు పొంగి ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి.రెండు రోజుల తర్వాత అక్షిత కుటుంబాన్ని పడవ మీద సురక్షితమైన ప్రాంతానికి తరలించారు.
అక్షిత వాళ్ల నాన్న మాత్రం ఎంతో ఇష్టంగా కట్టించుకున్నా ఇంటిని వదిలి రావడం ఇష్టం లేకపోయినా తన మనసులో దాన్ని గురించి ఆలోచిస్తూ రాత్రి నిద్రపోయారు.
ఆయన అసలే హార్ట్ పేషంట్ వల్ల అక్షిత వాళ్లు కంగారుగా వచ్చేయడం వల్ల ఇంట్లోనే టాబ్లెట్స్ మర్చిపోయారు.

వరదలు తగ్గిన తర్వాత మా ఇంటికి వెళ్లిపోవచ్చు అని అనుకున్నారు మిగతా ముగ్గురు.ఉదయం అందరూ లేచారు”అక్క నువ్వు వెళ్లి నాన్నని లేపు నేను ఫ్రెష్ గా వస్తాను” అని చెప్పాడు రాజు.

“నాన్న…. నాన్న లేవండి…. నాన్న… లేవండి… నాన్న మీరు ఫ్రెష్ అయ్యి టాబ్లెట్ వేసుకోవాలి” అని చెప్పింది అక్షిత.అక్షిత ఎంత లేపిన లేగపోయేసరికి నాడీ చూసింది.

నాడి కొట్టుకోవట్లేదు పక్కనే ఉన్న డాక్టర్ని పిలిచి నాన్నని ఎంత లేపిన లేగడం లేదు డాక్టర్ ఒకసారి చెక్ చేయండి అని చెప్పింది.సారీ అమ్మ మీ నాన్న రాత్రి చనిపోయారు అని చెప్పారు డాక్టర్.

ఎంతో ఇష్టంగా కట్టుకున్నా ఇల్లుని వదిలేసి వచ్చారని బాధతో ఆ బాధను గుండెల్లో పెట్టుకొని ఇలా మాకు దూరం అయ్యారా అని ఏడుస్తున్నారు.iలా అక్షిత కుటుంబమే కాదు ఇలా ఏ కుటుంబంలోనైనా జరగొచ్చు ,జరగపోవచ్చు కూడా అది వరదల ఉద్రిక్తత కారణంగా కొందరు ప్రాణాలు మిగలచ్చు మరికొందరు ప్రాణాలు పోవచ్చు.

ఏది మన చేతుల్లో లేనిది.అక్షిత వాళ్ళ నాన్న మనసులో పెట్టుకొని బాధపడుతూ వాళ్లకి దూరమయ్యారు అదే వాళ్ళతో పంచుకుని ఉంటే ఇప్పుడు ఆయన బాగుండేవారేమో.
అలాంటి వాళ్ళని మనం జాగ్రత్త చూసుకోవాలని నా మనవి.అక్షిత తన కుటుంబానికి తానే పెద్దదిక్కు అయింది.

 

-మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *