పెంపకం

పెంపకం

అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కావడం వల్ల
అందరూ ఒకచోట చేరి కబుర్లు చెప్పుకునేవారు
పైగా చిన్న గుడిసెలు కావడం వల్లా ప్రతిదీ పరిరక్షించుకునేవారు
కానీ ఇప్పుడు హోదాల కోసం పెద్ద పెద్ద భవనాలు
అందులో చేరోగది ఎవరిగదిలో వారు ఉండడమే గానీ పెద్దలతో ఎంకలుస్తారు
పెద్దలే చోరువతో ఎదైన చెప్తే
చాదస్తం, మాకుతెలుసులే అనే అహంకారం
నాటి కాలంలో పెద్దల మాటలను గౌరవించే వారు
అలాగే ఆచరించే వారుకూడా.
నాడు తల్లిదండ్రి చేసే పనులే పిల్లలు చేసేవారు
ప్రతి పనిలోనూ ప్రతీది క్షుణ్ణంగా నేర్పేవారు
నేటి పెద్దలు ఊహాత్మక జీవితంలో ర్యాంకులని
కొలువులని పరిణతి చెందిన కూనలకు ప్రేరణలుగా నింపి విలువలు సాంప్రదాయాలను మరిపిస్తున్నారు
తత్ఫలితముగా వృద్ధాశ్రమాలు శరణాలయాలు పెరుగుతున్నాయి
పెద్దలను కడవరకూ చూసుకునే బాధ్యత పిల్లలపై ఉండేది
కానీ స్వేచ్ఛా స్వాతంత్రాల పేరుతో, లక్ష్యాలను గమ్యాలను చేరుకునే క్రమంలో పెద్దలనే కాకుండా
తమ బిడ్డలను కూడా కేరింగ్ వెంటర్లలో పెట్టి పెంచుతున్నారు

– హనుమంత

Related Posts