పేరు లేని బంధం

పేరు లేని బంధం

ఒంటరిగా ఉన్న నాకు తోడుగా వచ్చావు..
కన్నీటిగా మారిని నా కళ్ళకు ఆనందాన్ని పరిచయం చేశావు..
నాలోని బాధను పంచుకోగా వచ్చావు…
ఎవరు లేని నాకు నేనున్నా అనే బరోసానిచ్చావు..
నీకు నేనున్నా అని నా చేయి పట్టుకుని నడిపించావు…
ఎన్నో కలలు కనే నా కళ్ళకు తోడై నిలిచావు..
నాకు సంతోషాన్ని పరిచయం చేశావు..
కన్నీళ్లను తరిమేసావు..
ఒంటరిగా ఉన్న నా ఈ జీవితంలో అడుగు పెట్టిన నీకు ఏ పేరు పెట్టను..?
ఏ రక్తం సంబంధం ఉందని నాకు ఇవ్వన్నీ చేశావు..?
ఏ జన్మ బంధానివి నువ్వు..?
ఈ జన్మకు నాకు ఇలా తోడుంటున్నవు..
నీతో ఉన్న పరిచయానికి, ఒక పేరంటూ నేను పెట్టలేను…

ఏ పేరు లేని బంధంగా… నిలిచిన మన ఈ పరిచయానికి కాలమే తగిన పేరు నిర్ణయిస్తుంది అని భావిస్తున్నాను..

– వనిత రెడ్డీ

Related Posts