పేరు పెట్టకు మేలు!!

పేరు పెట్టకు మేలు!!

కడవకెట్లు ఎరుక
ఎండిన నీ గొంతుక మంట…….?

అగ్నికెట్లు ఎరుక
గింజని మెతుకుగ చేయ……..?

ఫలమునిచ్చు చెట్టు
ప్రతిఫలం ఎరుగునా…………?

పారు నదికేం బట్టె
పోవు నది…………
నీ ఊరు గుండా……………..!

ఎండిన పైరు ముంచు
నిన్ను కన్నీటి సాగరంబున.
వర్షమొచ్చి నిచ్చు
నీ పైరుకి పచ్చ తాంబూలం.
దానికెట్లు ఎరుక
పండించను నీ పంట ……..?

పేరు పెట్టకు మేలు
మంచి చేయి చాలు…………!

కడవ మోసిన చలువ
నది దాని బాధ్యత ఔనా ….?

– వాసు

Related Posts