పిల్లలు

పిల్లలు

లేమ్మా స్కూల్ టైమ్ అవుతుంది లెగండి త్వరగా స్నానం చేయండి. నేను టిఫిన్ రెడీ చేసే సరికి మీ స్నానాలు అయిపోవాలి మరి. అంటూ సరస్వతి పిల్లలను లేపుతుంది. అమ్మా పది నిమిషాలు అంటూ ముసుగు గట్టిగా లాకున్నది లావణ్య. చెల్లితోపాటు లేస్తానమ్మ అంటూ పరిమళ కూడ దుప్పటి బిగించింది.

లేటైతే దెబ్బలు పడతాయి మీకే స్కూల్ లో లేవండి అంటూ లేపేసి వంటింట్లోకి వెళ్ళింది సరస్వతి. వంట తయారు చేసి బాక్స్ లు సర్థుతూనే టిఫిన్ పెట్టింది స్నానం చేసివచ్చిన పిల్లలకు… పిల్లలను రెడీ చేసి బ్యాగులిచ్చి స్కూల్ కి పంపించి ఇంటిపనులు చూసుకుంటుంది సరస్వతి.

పిల్లలు వచ్చేసరికి పనులన్నీ ముగించుకొని వాళ్ళకు తినడానికి అల్పహారం రెడీ చేసి హోంవర్క్ చేయించడానికి రెడీగా ఉండేది సరస్వతి.. పిల్లలు మోహాలు ఏలాడేసుకుని వచ్చే వాళ్ళు. బ్యాగులు అక్కడ పడేసి చేతులు కాళ్లు కడుక్కొని ఆ చేసిందేదో తినేసినాక మళ్ళీ పుస్తకాల కాడ కూర్చోబెడుతుంటేది సరస్వతి హోమ్ వర్కంటూ…..

ఎప్పుడు నువ్వు ఇంతేనమ్మ వచ్చినదగ్గర నుండి రాపిస్తూనే ఉంటావు అంటూ పిల్లలు అడుగుతుంటే అమ్మో అందరికన్నా వెనుకబడిపోతారు మీరు అంటూ పిల్లలకు కాస్త కూడా స్వేచ్ఛ ఇచ్చేది కాదు. సరస్వతి పిల్లల్ని ఊపిరాడకుండా చదివిస్తూనే ఉండేది. పిల్లలకు వాళ్ళ అమ్మంటే ఒక విధమైన కోపభావం పెరగటం మొదలైపోయింది.

అమ్మెప్పుడూ మాతో ఏదో ఒకటి చేపిస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చదివిస్తూనే ఉంటుంది పుస్తకాలు తప్ప మాతో ఆడుకోదు, ఆడుకోనివ్వదు అని.. పిల్లలకి వాళ్ళ అమ్మ మీద ఒక విధమైన కోపం మొదలైపోతోంది వాళ్లు కొంచెం వయసు వచ్చేసరికి వాళ్ళు అమ్మ మాటకు కాస్త ఎదురు తిరగటం మొదలుపెడుతున్నారు.

ఇదేంటి నేను ఎంతో బాధ్యతగా వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంటే అనుకుంటూ సరస్వతి మాత్రం తను చేయాల్సింది చేయాల్సిందే అని పట్టు వదలని విక్రమార్కుడిలా పిల్లల్ని ఊపిరానివ్వకుండా అలా ట్యూషన్ కి పంపటం మొదలు పెట్టింది.

తను చెప్పే వయసు దాటిపోయింది పై చదువులకోసం దూరాలు వెళ్ళారు వాళ్ళకు చాల హాయిగా ఉంది సమయాన్ని గుర్తుచేసి విసిగించే వాళ్ళు లేరుకదా కొన్నాళ్ళు హాయిగా ఉంది. ఇప్పుడు బాధ్యతే వాళ్ళకు గుర్తు చేస్తుంది సమయానికి వెళ్ళకుంటే గెంటేస్తారు అని అలారం పెట్టుకుని వెల్లడం మొదలైయింది.

చదువు పూర్తై ఉద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళకు తల్లిదండ్రులంటే బాధ్యతలప్పుడే గాని ప్రేమ, మమత లాంటివి ఉండేవి కావు సరస్వతి చాల బాధపడేది.. వాళ్ళకోసం ఎంత కష్టపడ్డాను అయినా కొంచం కూడా వాళ్ళకు నాపై ఇష్టం ఉండదూ అనుకునేది…

పిల్లలిద్దరికి పిల్లలు పుట్టారు మళ్ళీ వాళ్ళు కాన్వెంట్లుకు వెళుతున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా అప్పటి నా పరిస్థి కంటే కాస్త ఎక్కువగానే హడావుడి పడుతున్నారు. వాళ్ళపిల్లలు మంకుపట్టు పట్టినప్పుడల్లా వాళ్ళు కోపగించుకుంటుంటే సరస్వతికి అప్పటి తన పరిస్థితి గుర్తొచ్చేది. 

కాల భ్రమణం ఎప్పుడూ ఒకేలా తిరుగుతుంటుంది ఎవరికి వారు గుర్తించరు. అప్పుడు అమ్మ చేసేది తప్పు అనిపించింది కానీ ఇప్పుడు వాళ్ళు చేసేది తప్పు అనిపించటంలేదు..

ఇప్పుడు అదే పని వాళ్ళకు బాధ్యత అనిపిస్తుంది. అప్పుడు నా మీకు కోపమొచ్చేది కదా ఇలా వత్తిడి చేస్తే అంటే ఊరుకుంటారా ?

కాల బ్రమణం ఇప్పుడు నేను వాళ్ళకు ముసలి పిల్లనే కదా. పిల్లలతో సమంగా కోపం తెచ్చుకుంటారు. ఇప్పుడు నా అభిప్రాయం వాళ్ళకెందుకు అంటూ మౌనంగా ఉండిపోయింది…

నిజానికి ఇంత ఒత్తిడి పిల్లల మీద పెట్టడం పెద్దలది చాలా తప్పే మించిపోయిన ఒత్తిడి కూడా వాళ్లలో సహజమైన ప్రేమ తత్వాన్ని కనుమరుగు చేస్తుంది. బాధ్యత తప్పనిచ్చి ప్రేమ మమత ఆస్వాదనా లేకుండా చేస్తుంది. కాబట్టి మించిపోయిన ఒత్తిడిని పిల్లల మీద పెట్టడం కూడా మంచి పద్ధతి కాదు కాలం ఎప్పుడూ ఒకలానే ఉంటుంది.

కానీ మన ఆలోచనలు మన ఊహలు కోరికలే వాటికి మించి పరిస్థితిలను తారుమారు చేస్తుంటాయి. పరిస్థితికి తగినట్లుగా మన బాధ్యతలను సమన్వయ పరుచుకుని పిల్లలతో సరదాగా గడపటానికి కొంత సమయం అయినా కేటాయించుకోవడం చాలా ముఖ్యం.

బోలెడంత సంపాదించి వాళ్ళనేదో ఆనందపెడదాము అనుకుని ఇవాళ ఆనందాన్ని అంతా కొల్లగొట్టడం సరైనది కాదు.. పిల్లలకు ఆస్తులు కన్నా కూడా మంచి జ్ఞానం విజ్ఞానం ఉల్లాసాన్ని ఇవ్వండి మంచి తరాన్ని తయారు చేసిన వాళ్ళను అవుతాము.

మూగజీవులే సంపాదించుకొని తింటున్నాయి ఇంతజ్ఞానమున్న మన పిల్లలు సంపాదించుకోలేరా తినడానికి ? మన ఆస్తులు ఇవ్వకపోతే!.. ఆలోచించండి వాళ్లతో కొంత సమయం కేటాయించి హాయిగా గడపండి వాళ్లతోటి పెద్దలు కూడా బాల్యంలోకి వెళ్ళి పోవచ్చు…

– సత్యవతి ఆలపాటి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *