పూ సరాగం

పూ సరాగం

పూ సరాగం

అరుణారుణ కిరణాలు భూమిని తాకగానే
తోకముడిచి పరుగెత్తిన నిశీధిని చూస్తూ
మొగ్గతొడిగి విచ్చు కుంటున్న విరులన్నీ
పక్కున నవ్వాయి పరిమళాలు పరచుకుంటూ
సుగంధాలను జగమంతా ఆఘ్రాణింపచేస్తూ‌…..

ఆ సూర్యబింబమే తన కిరణాలను అరువిచ్చి
పూలను తనమారుగా ప్రకాశింపచేస్తున్నట్లు
విచ్చుకుని తలలూచుచు హాయిపంచుతున్నాయి
తల్లీ బిడ్డలవోలె పెద్ద చిన్న కుసుమాలై
ఒకరినొకరు చూచుకొనుచు ఆనందం పంచుకొనుచు

ప్రేమారగ విరబూసిన అల్పమైన బ్రతుకులోన
ఆశలతో అణగారుతు స్వార్ధముతో నిండిపోక
సుతిమెత్తని ఆ పూవులు చూడు తెలుపుతున్నవి
ఆనందానికి నిజమైన అర్ధాన్ని…
బంధానికి వాస్తవిక చిత్రణను….
సందేశాత్మక జీవితమై చిరునవ్వులు రువ్వుతున్నవి…
మనిషి పుట్టుక చావులలో తాను సైతమని తోడుంటున్నవి….

– ఉమామహేశ్వరి యాళ్ళ

ఇకనైనా మేలుకోండి.! Previous post ఇకనైనా మేలుకోండి.!
తరాల అంతరాలు Next post తరాల అంతరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *