ఈ రోజు అంశం
నాలాంటి ఒకడు

శీర్షిక
నేనంటే నేనే.

నాలాంటి వాడు మరొకడు ఉండడేమో. నా వేలి ముద్ర
ఇంకొకరితో సరిపోల్చి చూడలేం . ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఆరుగురు ఉంటారు అని అందరూ
అంటుంటారు కానీ వారిని కలుసుకునే అదృష్టం ఎవరికీ
ఉండదు. ఒకే తల్లి కడుపున పుట్టిన కవల పిల్లలు ఒకే రూపుతో ఉండవచ్చు కానీ
వారి అలవాట్లు వేరుగా
ఉంటాయి. నేను నా చిన్నతనం నుండి ఇప్పటివరకు అనేక
విధాలుగా మారాను.
శారీరకంగా ఎదిగాను.
మానసికంగా కూడా
పరిపక్వత సాధించాను.
మంచి- చెడుల మధ్య
తేడాను గుర్తించి తదనుగుణంగా ముందడుగు వేస్తూ
పోతున్నాను. అలా
మార్పు చెందుతున్న
సంధర్భాలలో నేను
చాలా తప్పొప్పులు చేసి ఉండవచ్చు. తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకొని
నలుగురికి చెప్పే స్థితికి చేరుకున్నా. నా జీవితాన్ని నేను సంతృప్తికరంగా గడపాలి అంటే
చాలా కష్టపడి పనిచేయాలి అని
గుర్తించా. ఆ విషయం
అందరికీ తెలిసిన నాడు
అందరూ విజయపథంలోకి అడుగులు వేస్తారు.

ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని