ప్రగతికి జ్యోతులు – బాలల గీతం

ప్రగతికి జ్యోతులు – బాలల గీతం

పల్లవి
నేలను నింగిని కలిపేస్తాం
ఆనందాలను దించేస్తాం
అలసటలన్నీ తీసేస్తాం
మేమే బాలలం..ప్రగతికి జ్యోతులం

చరణం
పాఠశాలయే మా ఇల్లు
గురువులు మాకు దేవుళ్లు
చదువే మాకు కళ్ళండీ
ఇది నిజమండీ నమ్మండీ
మేమే బాలలం!ప్రగతికి జ్యోతులం!

చరణం
అమ్మా నాన్నల నమ్మకము
మము దీవించే ఆకశము
ఆశల దీపము వెలిగించి
ఆశయ సాధన చేసెదెము!!
మేమే బాలలం!ప్రగతికి జ్యోతులం!

చరణం
ఆటపాటల అల్లికతో
అలుపు సొలుపు ఉండవుగా
కలల కోటలే కట్టెదము
కలతలు నలతలు తీర్చెదము!!
మేమే బాలలం!ప్రగతికి జ్యోతులం!

చరణం
నిన్నటి చరితను చదివేసి
రేపటి భవితను రాసేసి
నేటిమాటను నేర్చుకునే
ఆశయ సౌధాలం
మేమే బాలలం!ప్రగతికి జ్యోతులం!

– సి. యస్ రాంబాబు

Related Posts