ప్రకృతి కాంత

ప్రకృతి కాంత

ప్రకృతి కాంత

పచ్చని పరువాలను చుట్టుకున్న ప్రకృతి కాంత
మార్గశిరం రాకతో వణుకుతూ గజగజల చలిగాలి
చల్లని మలయమారుతంలా విసరుతూ
ప్రజని ఉలిక్కిపడేలా చేస్తుంది గడగడలతో…

ఆ పచ్చని పరువాలకి అలంకారంలా
రేయంతా మంచుబిందువులు అల్లుకుంటే
చూసే కనుదోయికి తెలియని ఆనందం నింపుతూ
వెన్నెల కాంతిలో తళుకులీనుతుంది
నిశీధి రేయిలో తాకగా ఝల్లున మదిని తడుతుంది

ఉషోదయాన నునువెచ్చని కిరణాలు ప్రసిస్తూ
భానుడు ఉదయిస్తుంటే ఆ కిరణాల తాకిడికి
మరింత ప్రకాశింపచేస్తూ ఆనందం పంచుతాయి
వేడెక్కిన సూర్యకిరణాలు తాకగానే
జర్రున జారిపోతుంది తామరాకుపై బిందువులా
మంచు దుప్పటిని తొలగించుకున్న ప్రకృతికాంత‌

– ఉమామహేశ్వరి యాళ్ళ

మంచు దుప్పటి Previous post మంచు దుప్పటి
మంచు Next post మంచు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *