ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి… ఎందరో చిద్రమైన బ్రతుకులు నాశనం అయిపోయాయి.. వాళ్ళకి తోడుగా ఎవరి అండ లేదు..  వాళ్ళు పిల్లలతో ఎన్నో బాధ పడ్డారు.. తీవ్రమైన వడగాల్పులు, చలిగాలులను ప్రకృతి విపత్తులుగా భావించి నష్టపరిహారం ఇచ్చే అవకాశంలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.. ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం.

అయితే వరదలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం వల్ల పర్యావరణం కలుషితమవుతుంది. అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగాల బారిన పడతాయి… కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం అప్రమత్తంగా ఉండడంతోపాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు, ఆహార పదార్థాలు సేకరించి పంపడం, సేవాక్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేయాలి…

⁠- మాధవి కాళ్ల

Related Posts