ప్రకృతి అందాలు

ప్రకృతి అందాలు

ప్రకృతి అందాలు

ప్రకృతి అందానికి పరవశించని వారు ఉండరు

ప్రకృతిని పలకరిస్తే వర్ణాలు వలకబోస్తుంది

మనసుని ఆహ్లాద పరుస్తుంది

హాయిగా వీచే చిరుగాలులు

అల్లంత దూరంలో ఆకాశపు వినువీదులు

ఆసక్తిని పెంచే కొండాకోనలు

స్వచ్ఛతకే మారుపేరు గా సెలయేళ్ల ధారలు

ప్రశాంతతను నింపే పచ్చిక బయళ్ళు

వినసొంపైన పక్షుల కిలకిలా రావాలు

కనువిందు చేసే పూల తోటలు

పచ్చని పాడి పంటలు నోరూరించే ఫలాలు

అమూల్యమైన జీవరాశుల సంపద

సరికొత్త అనుభూతులను పంచే ప్రకృతమ్మ వరం

మనసును కట్టిపడేసి మదిని మురిపించి మరిపింప చేస్తాయి ప్రకృతి అందాలు

సుడిగాలులు జడివానలు
ఉప్పెనలు ఉత్పాతాలు
అన్నీ ఉన్నా ప్రకృతిలో

జీవరాశి మనుగడ కోసం ఇప్పుడు మన ముందున్న ప్రయత్నం ప్రకృతిని కాపాడుకోవడం

ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూనే చేటు చేసే పరిణామాలను కూడా అడ్డగించాలి

అప్పుడే అనునిత్యం ప్రకృతి ప్రసాదించిన అందాలుపరిరవిల్లుతాయి
ధరణిలో…..

– జి జయ

తిరుమల గీతావళి Previous post తిరుమల గీతావళి
భారతదేశ గొప్పదనం Next post భారతదేశ గొప్పదనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *