ప్రాణం

ప్రాణం

వచ్చే ప్రాణం పోయే ప్రాణం
అంతులేని కథ
ప్రాణం ఖరీదు ఎంత అంటే
తెలియదు
కన్నీటి ఖరీదు ఎంత అంటే తెలియదు
ప్రాణానికి జీవం ఎక్కడిదో
తెలియదు
సృష్టి రహస్యం మూలం
తెలియదు
కాలానికి గమ్యం
ప్రాణానికి కాలం
తెలియదు
ఉచ్వాస నిష్వాస లోతు
తెలియదు
ప్రాణం విలువ ప్రేమకు
తెలియదు
ఆశ కోరిక పరిమితులు
ప్రాణానికి తెలియదు
ప్రాణానికి మరణ శాసనం
రాసి పెట్టే వుంటుంది
అతి చిన్న ప్రాణం
అందరి ప్రాణం
ఎంతో విలువైన ప్రాణం
ఎందరికో అవసరమైన ప్రాణం
ఏమీ తెలియని హృదయ స్పందనకు ధన్యవాదాలు
ఎడలోని భావాలు
మేదిలేటి ఆలోచనలు
జ్ఞాపకాల దొంతరలు
వూహించని జ్యోతి
తప్పించని ఆవేదన
అన్నిటినీ కలిపి పురుడు
పోసుకున్న ప్రాణాన్ని
చివరివరకు నీకు నువ్వు గా
విలువగా నిలుపుకోవాలి ….

– జి జయ

Related Posts