ప్రణవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతు అందరి తరుపున చిరు కానుకగా

ప్రణవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుఅందరి తరుపున చిరు కానుకగా

ప్రణవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు 
తెలుపుతు….🎂🌺🌹🤝
అందరి తరుపున చిరు కానుకగా…

నీకోసమే….!!!

తనువును తాకుతు గడిచే సమయం
నిన్ను నిలబెట్టిన ప్రేమలే…సుమా…!
నిజాన్ని గ్రహిస్తావని ప్రతి గళం నీదై
మరిచిన రోజులకు మన్నింపు కావాలని
కోరుకొంటు…

పడిలేచే చీకటి వెలుగుల సంగతులు
ప్రతి జీవితానికి మార్గదర్శకమని…
నీకు తెలిసిన నైతికతతో పోరాటం కాని
జీవితాలకు నిర్వచనమై నిలబడాలని
ఆశిస్తూ…

నీవన్నది వ్యథలను కొలువని
చిహ్నమని…నూతన వసంతాలకు
ఆహ్వానమవుతు ప్రతి క్షణాన్ని పలకరించిన
ధీమాతో…నిన్నటికి నేడు రూపమవుతు…
నేటికి రేపటి వ్యూహాన్ని రచించుకొంటు
సార్థకతను సాగిస్తావని…

పిలిచిన మజిలీలతో జీవితాన్ని
నేర్చుకొంటు…ఆకారంలేని వికారాలతో
హృదయాన్ని బంధించక…గమ్యం
చేజిక్కిన వాడిగా ఆనందాలకు నిలయమై…
పోటెరుగుతు పాటుపడుతు ఆచరణలకు
యోగ్యుడవై నిండు నూరేళ్ళుగా జీవితాన్ని
సాగించాలని…🌹🤝🌺🎂

 

-దేరంగుల భైరవ

తెలుగుభాషను కాపాడుకుందాం తెలుగువారిని గౌరవిద్దాం Previous post తెలుగుభాషను కాపాడుకుందాం తెలుగువారిని గౌరవిద్దాం
అర్జునుడు గొప్ప వీరుడా లేక కేవలం 14000 మందిని చంపిన రాముడు గొప్ప వీరుడా? Next post అర్జునుడు గొప్ప వీరుడా లేక కేవలం 14000 మందిని చంపిన రాముడు గొప్ప వీరుడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close