ప్రశాంతత రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి
శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగయ్య ఎప్పుడో చెప్పారండీ.
తన శాంతము తనకు రక్ష అని వేమన కూడా చెప్పారు.వారందరూ జీవితాన్ని కాచి వడబోసిన వారు.
మానసిక ప్రశాంతత వలన మనకు చాలా రోగాలు రావు.బి.పి,షుగర్, హృద్రోగాలు ఇవన్నీ మనిషికి మానసిక వత్తిడి వల్లే కలుగుతున్నాయి.
ఇవి ఒకసారి మనిషిలోకి ప్రవేశించాయి అంటే జీవితం హాస్పిటల్ పాలే.డాక్టర్ల కి కాసుల పంట.మనకేమో కాళ్ళ తిప్పట. జీవితం దుర్భరమైపోతుంది.
మన పని కూడా మనం చేసుకోలేని స్థితి.అది అవసరమంటారా మనకి. శరీరాన్ని కష్ట పెట్టాలి.
శరీరం కష్ట పడకుండా ఆరోగ్యాన్ని అడిగే హక్కు ఎవరికీ లేదు.
వ్యాయామం,యోగా,ధ్యానం,ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవటం వలన మనసు కూడా ప్రశాంతం గా ఉంటుంది.
ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించడం వలన శాంతి లభిస్తుంది.
సాత్వికాహారం కోపాన్ని,అలజడిని దూరం చేసి శరీరాన్ని ,మనసును కూడా శాతంగా ఉంచుతుంది.
సో,అందరం ఇలా నడుచుకుని మనసును శాంతి వైపు ప్రయాణించుకుందాం.
-రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి