ప్రశాంతత
శాంతము లేక సౌఖ్యము లేదు
త్యాగరాజు గారి బోధ
శాంతి సౌఖ్యములు మానవాళి
జీవితాశయం ముందు,
అవి పొందాలంటే ఓర్పు, సహనం
జీవితాన ముఖ్యం ప్రతి అడుగున
ప్రతి బింబించు,శాంతి స్వరూపం
చేదోడు వాదోడు చెలిమికి ,కలిమికి
మిత్రుడే ఈ శాంతి స్వరూపం
గాంధి తాత సాధించె మహా
ఉజ్వల మైన కార్యం
ప్రాణ నష్టం, ధన నష్టం
ఏరకమైన బాధ లేకుండా
జీవితం సాఫీగా సాగించాలి
అంటే మానవత్వపు మర్రి
నీడలో శాంతి సౌభాగ్యాల
ఆశీస్సులతో అనంతం
అపురూపం అది మంచి
మనసున్న మనుషులకు
ప్రత్యేకం !!!
– కె.కె.తాయారు