ప్రశ్నించే తత్వం

ప్రశ్నించే తత్వం

ఏమౌతుందో తెలీదు లోకంలో
ఎవరికివారన్నట్టు
అందరూ మనకెందుకన్నట్టూ
ఎవరేమైతే నాకేంటన్నట్టూ
ఎవరిలోకంలో వారు చరిస్తూ పోతుంటే…

అన్యాయం జరిగిన అసమర్ధుడు
అసమానతలపాలైన అభాగ్యుడు
వర్గపోరులో సర్వం కోల్పోయిన ధీనుడు
చదువుండి బీదవాడై ఒంటరైన నిరుద్యోగీ
కాలం కసిరితే ధనహంకారానికి లోబడిన బీదవాడు

లోలోపల ప్రశ్నలతో మగ్గుతూ
ఏకాకికిగా గొంతు విప్పలేక
పెగిలిన గొంతు శాస్వతంగా ముగిసే చర్యలకి‌ జడిసి
ఒంటరులైన ధీనులకి నేడు తోడెవరని
అసమానతలకి అలవాటుపడి బ్రతికేసే మనం
ఎవరికివారంటూ బ్రతికేస్తుంటే…
అన్యాయాలని ప్రశ్నించేదేనాడనీ
నాయకులచే సుపరిపాలన చేయించెదెపుడనీ
మనసులో మాటలు పెగలనీయని అసమర్ధతలో ప్రశ్నించే తత్వం ఎక్కడుందనీ…

ఇకనైనా మారుదామా నేస్తాలూ…
ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ పెరిగిన ధరలకి …
చుట్టూ జరుగుతున్న అన్యాయాలకీ…
గూండారాజ్యంగా మారిన సంఘాన్ని…
ఆడవారిపై జరిగే అత్యాచారాలనీ…
మదిలో దాచుకుని కుమిలిపోక ప్రశ్నిద్దామా???
నిగ్గదీసి అడిగి అన్యాయానికి ఎదురెళదామా???

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts