ప్రతి అడుగు ప్రగతితో…!!!
తరగతులుగా మారుతున్నది
నీ జీవితం మజిలీతోనే ఆగిపోతే…
ఏనాటికి శాశ్వతంలో అమరిన సత్యాన్ని
తెలుసుకోలేక…బడుగు బొందిలో
రోజుకొక ఎముకను విరుచుకొని
చలి కాచుకొంటుపోతే చివరకు మిగిలేది
ఏముండదు…
ఆచరించే ఎన్నో సమీకరణాలకు
ఈ ప్రపంచం వెలుగు…అదే ప్రపంచం
ప్రామాణికమై ధృవీకరించిన సూత్రం…
డబ్బుకు లోకం దాసోహమేనా…!!
ఇది ఆగమనాలకు అనుసంధానమా లేక
ప్రజా మనుగడకు విరుద్ధ పోరాటమా…
విషదీకరించుకో….
నీగతం దయానీయమైనదో…లేక
దురాక్రమణ కూటములకు ప్రోత్సాహమో
తెలియనంత వరకు నిజం నివురు
గప్పినదే…ఆసన్నమైన సమయాలతో
ఒతికిల బడిన సందర్భాలతో సమాధానం
చెప్పలేని నాడు…అది నిప్పై కాల్చుతుంది
ఇది నిజానికున్న సహజత్వం…
లోకం చేయని నీతి పునాదుల
కొరిగిందని ధ్వజమెత్తిన ధ్యేయాలు
వడిసెల రాయిగా విసరి వేయబడ్డాయని…
చట్టంకళ్ళు గప్పలేవు ఉరితీసే నియంతలు
పోయారు…ప్రజల కొరకు నిర్మించుకొన్న
ప్రజాస్వామ్యం డబ్బుకు లోకం కారాదు…
పేదరికాన్ని నిర్మూలించడానికి వేయాలి
ప్రతి అడుగు ప్రగతితో…
– దేరంగుల భైరవ