ప్రతి జన్మకు కోరనా!

ప్రతి జన్మకు కోరనా!

ఊసులన్నీ
చెవిలో తేనెలు నింపుతుంటే
మెదడుకు చేరిన మధురిమను
ఆస్వాధిస్తుంటాను..

చూపులన్నీ
ఎదలో బాణాలు వేస్తుంటే
మన్మధబాణపు తీయని‌బాధను
మరిమరి‌కోరుకుంటాను..

మనసంతా
నీ తలపులు నిండితే
ఓలలాడనా జతకూడిన మధురోహలలో

బంధము
లతలా పెనవేసుకుని
జన్మజన్మలకి నీతోడు కోరుకుంటూ
ప్రతి జన్మకు నీ జతనే కోరనా..!

 

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts