ప్రేమ బానిస

ప్రేమ బానిస

నీ వలపుల తోటలో శశినై,
నీ ఎద లయలలో నిశినై,
నీ సొగసుల వలలో నిధినై,
నీ చూపుల్లో చిక్కిన కాటుక రవ్వనై ,
పడుతూ లేస్తూ నిన్ను అందుకోవడానికై తపించే పసిపాపనై,
నీలాలా నింగిలో మెరిసే తారనై,
ఎగసే నా హృదయపు అలల తాకిడిలో నిశీధినై,
నిన్ను చేరాలనే చేరలేననే అలజడిలో మతిలేని ఒయాసిస్సునై,
గతమైనా జతగా చెరపలేననే ఒంటరినై,
ఎన్నటికీ నిన్ను చేరలేని శవమై…

బ్రతికినా చచ్చి బ్రతకలేని బ్రతుకుతున్న నీ భాధితుడినై..
ఇదే ఇదే ఇదే నీ ఒప్పలేని ఒప్పుకోని తప్పుకోని ప్రేమకు
సదా బానిసనైన నీ “వాలెంటైన్” …💔💔💔💔

– అర్జున్

Related Posts