ప్రేమ దేవత

 

స్నేహశీలిగా మెలిగిన రాగ మల్లిక

నీ ప్రేమ జల్లులు కురిసిన తీగ మల్లిక

నా తీపి కోరిక…

అలా కొనసాగిన అల్లరి ఆటలు

నా చిల్లరి పాటలు నీలో తపనలు రేగగా

బంధించావే బంధాలతో..

రోజురోజుకు రోజా పువ్వుగా నాలో పూయిస్తున్నావు

కొత్త కొత్తగా ఉన్నాయి నాలో కలిగే భావాలన్ని..

నీవు కనబడని క్షణం నాలో రేగే అలజడి వర్షం..

తపనలతో తడి అవుతూ ఉంటా..

నీవు కనబడుతూ ఉంటేనే

నాలో కలిగే కొత్త ఆశలు చిగురిస్తూ ఉంటాయి..

ప్రేమ తపస్సు చేస్తూ ఉంటా నీపై లగ్నం చేస్తూ..

ప్రేమ దేవత కరుణించే వరకూ..

వరములు కురిపించేవరకూ..
ఎంత దూరంలో ఉన్నా నీ మనసు నా చెంతన ఎల్లప్పుడూ నీ చింతన..

చిలిపి కోరిక పుట్టిన నీ తీపి గుర్తులు నాకు మాసిపోవులే

ఎన్నడూ నీవు దూరం ఉన్నా నాకు దగ్గర ఉన్నట్లే…

– పలుకూరి

Related Posts