ప్రేమ – గుడ్డి

ప్రేమ – గుడ్డి

రోజా మహిపాల్ ను ప్రేమించింది..
ఎంతంటె అతని మాటలతో లోకాన్నే మరిచి పోయేటంతగా!

రోజూ ఏదో ఒక వంకతో రోజా వాళ్లింటికి రావడం తన
కన్నీ ఏవేవో మాటలు చెప్పి బోల్తా కొట్టించడం చేసేవాడు..

రోజూ వచ్చినా దూరపు చుట్టరికం ఉండడంతో వాళ్ల
అమ్మ శారదమ్మ ఏమీ అనలేక పోయేది..

అయితే ఒకరోజు వాళ్ల మాటలు విన్నది శారదమ్మ
పెరట్లో మంచం మీద కూచుని ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు..
కరివేపాకు కోసుకుందామని అటు వెళ్లిన శారదమ్మకు మాటలు వినిపించాయి..

మన పెళ్లయ్యాక నిన్ను బండి మీద రోజూ సినిమాలకు
తిప్పుతా!
బేకరీలకు తిప్పుతా! అంటున్నాడు..
రోజానేమెా! ఊ….అని గారాలు పోతూ..
నాకు వాటన్నీటితో పాటు చాలా నగలు కూడా చేయించాలి .అంది..

ఓ …బోలెడు నగలు చేయిస్తా! ఇప్పుడైతే ఈ మల్లె దండ పెట్టుకో! అని మూరెడు దండ ఇచ్చాడు..

మీరే పెట్టండి అంటూ మైకంగా తల అతని వైపు పెడుతుంటె..
శారదమ్మ చూసి..
ఒసేయ్ రోజా అని గట్టిగా అరిచింది..
ఆ అరుపుకి భయపడి మహిపాల్ ఆ దండ అక్కడే పెట్టేసి పరుగున వెళ్లి పోయాడు..
ఇంకో సారలా నా కంట్లో పడ్డారో! చంపేస్తాను అందావిడ

రోజా బుంగమూతి పెట్టుకుని లోపలకు వెళ్లింది..
మళ్లీ మళ్లీ రావడం బడాయి మాటలు చెప్పడం రోజా
ఆ మత్తులోనె మునిగింది..
మరోసారి మళ్లీ పూల మాల పట్టుకొచ్చి రోజాకిచ్చి
ఐ లవ్ యు అన్నాడు..
ఏంటీ అందరూ గులాబీ ఇచ్చి ఐ లవ్ యు చెప్తారు
నువ్వేంటి మల్లె పూల మాల తెచ్చి లవ్ యు చెప్తున్నావు అంది..

నా మనసు మల్లె పూవులా తెలుపని అన్నాడు..
నా మనసు కూడా అంతే నీ పైన అంటుండగా మళ్లీ
శారదమ్మ చూసింది..

అతను పోయాక రోజాకు అర్థ మయేలా మహిపాల్ మాటలు నీళ్ల మూటలు అతని నీటి మూట నమ్మి నువ్వు ప్రేమిస్తున్నావు అంది..

ఇంత దాకా వచ్చాక ఎందుకనీ బల్ల గుద్ది చెప్పేసింది
నేను పెళ్లి చేసుకుంటే అతణ్ణే చేసుకుంటా లేకపోతే
చచ్చిపోతానని..
ఇంకేముంది?
విషయం నాన్న వరకూ వెళ్లింది..
నాన్నేమెా! పోనీలే! మన కులమే కదాని పెళ్లి చేసాడు
రోజా ఇద్దరు పిల్లల తల్లైంది..
అప్పుడుగానీ తెలిసి రాలే! అమ్మ చెప్పిన మహిపాల్
మాటలు నీటి మూటలని..

కానీ ఏం చేస్తుంది?
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం?
ఈ కాలంలో ఇలాంటి మహిపాల్ లు ఎందరో!!
అందుకే పిల్లలూ! పెద్దల మాట చద్దన్నం మూట అని తెలుసు కోండి ముఖ్యంగా యువతులూ! తస్మాత్ జాగ్రత్త!!

– ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *