ప్రేమ ఇతిహాసము

కాను నేను
మూగ జీవిని.
అవసరానికి విప్పెదను
నా కంఠము………….!

నా ప్రేమకి
భాష్యం లేదులే………..!
ఉదారమైన,
నా చూపుల భావాలు
చెప్పునునీకు
ప్రేమ ఇతిహాసము!

నా రాత,
బాలేదులే ప్రియా………!
నీ చెవులకు చేరువాయె
నీ హృదయము………!

వినికిడి కాదులే
నా తీయని వేదన………………!
చెవులకు
అందనిదే ఆది………!

నీ హృదయం
చేరదులే దాని
యధాస్థలి………….!
ఇక,
ఈ జన్మకు ఇంతే…….!

– వాసు

Related Posts