ప్రేమ కథ (2016- 2022)

ప్రేమ కథ (2016- 2022)

నా పేరు శివకుమార్. నేను 7వ తరగతి చదివేటప్పుడు తనని మొదటి సారిగా మా తరగతి గదిలో చూశాను. తన పేరు అనన్య. తనని చూడగానే ఇష్టపడ్డాను. ఎప్పుడూ అనుకోలేదు ఇలా ప్రేమలో పడతాను అని. తనకి తెలియకుండా తన వెంటపడ్డాను. తనని చూడగానే నా మనసులో ఎదో తెలియని ఉత్సాహం, ఉల్లాసం అలా తనని చుస్తూనే సంవత్సరం గడిచిపోయింది.

8వ తరగతి లో తనకు నా మనసులో మాట చెప్పాను. తన ఏమి మాట్లాడలేదు. కోపంగా చుస్తూ వెళ్ళిపోయింది. తను మాట్లాడటం కూడా మానేసింది. తనతో స్నేహం కూడా లేకుండా పోయిందే అని బాధ పడ్డాను.

కొన్ని రోజుల తరువాత తనే వచ్చి మాట్లాడింది. నా ప్రేమను అంగీకరించినట్లు చెప్పింది. ఎంతో ఆనందంతో తనని హత్తుకొన్నాను. ఆ క్షణం తన పెదవి పై వున్న ఆ చిరునవ్వు చూడగానే ప్రపంచాన్నే మరిచిపోయాను. 

తన కళ్ళలో నాపై వున్న ప్రేమను చుసాను. ఎప్పుడూ తను నాతోనే వుంటే బాగుంటుంది అనిపించింది. ఆ ఒక్క క్షణమే కాదు జీవితాంతం తను నాతో నాలో వుండాలి అనిపించింది. తరువాత 2 సంవత్సరాలు నా ప్రేమకథ ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా కొనసాగింది ….

10 వ తరగతి చదివేటప్పుడు తను అనుకోకుండా మాట్లాడటం మానేసింది. నాకు అస్సలు అర్థం కాలేదు చాలా బాధ పడ్డాను. ఎందుకు? ఏమైంది? అని అడిగాను ఒకరోజు. మా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది అని చెప్పింది అందువల్ల వాళ్ళ ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయని చెప్పింది. ఆ రోజు ఆలా గడిచిపోయింది. మరుసటిరోజు నేను వెళ్ళి పలకరించగా తను చాలా కోపంగా నా మీద అరించింది. ఏమైంది అని అడగగా “ఇప్పటి నుండి మనం ప్రేమించుకోవడం కుదరదు” అని అని చెప్పి వెళ్ళిపోయింది .

మేమిద్దరమూ ఒకే పాఠశాలలో చదవటం వల్ల నాకు చాలా ఇబ్బందిగా వుండేది. ఎందుకంటే తను నా పక్కనే వుంటూ దూరం పెడుతుంటే చాలా బాధగా అనిపించింది. అప్పుడే నేను చెడు అలవాట్లుకు బానిసనయ్యాను. తనని చుస్తూనే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అలానే మా ఇంటర్మీడియెట్ విద్య కూడా ముగిసింది. మేము ఇంటర్మీడియెట్ విద్యను రాయదుర్గం లో పూర్తిచేశాం.

ఇంట్లో పరిస్థితులు బాలేక పోవడం వల్ల నేను మా పల్లెటూరిలో వ్యవసాయం పనులు చేస్తూన్నను తను ఉన్నత విద్యాభ్యాసం కోసం తను అనంతపురం కి వెళ్ళిపోయింది. ఎప్పటికైనా తను మరలా నా జీవితంలోకి వస్తుందన్న ఆశతో వేచి చూస్తున్నా ప్రేమతో…. 

తను క్షేమంగా ఉండాలి అని నా ప్రేమ విజయవంతం కావాలని దేవున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను

(గమనిక: ఇది కల్పిత కథ కాదు. తిప్పేస్వామీ అను నేను స్వయంగా నా మిత్రుడు యొక్క నిజ జీవితంలో జరిగిన ప్రేమ కథను రాసాను. నేను చూసిన స్వచ్చమైన ప్రేమకథలలో ఇది ఒకటి)

– M. తిప్పేస్వామి

Related Posts