ప్రేమ లేఖల పోటీ

ప్రేమ లేఖల పోటీ

ప్రేమ అందమైన పదం, అందమైన భావం, జీవితంలో ఒక్కసారి అయినా ప్రేమలో పడాలని అనుకోనిది ఎవరు?

మొదటి ప్రేమ, రెండో ప్రేమ అంటూ రకరకాల ప్రేమలో పడతాం, ప్రేమంటే ప్రేమికుల మధ్య ప్రేమనే కాదు తల్లి, తండ్రి, సోదరుల ప్రేమ కూడా….

అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ ప్రేమలో ఇలా చెప్తూ పోతే బోలెడు ప్రేమలు. ప్రేమికుల పై ఎంత ప్రేమ ఉందో చెప్పొచ్చు, కానీ మిగిలిన వారి పై ఎంత ప్రేమ ఉందని చెప్పలేక పోవచ్చు.

అసలు ఆ సందర్భం రాకపోవచ్చు. వారికి తమ ప్రేమను చెప్పలేక పోయాను అనే బాధ ఉండొచ్చు. అలాంటి ప్రేమను లేఖల ద్వారా చెప్పండి. 

మీ ప్రేమ అక్షరాలను మాలలుగా కూర్చి పంపండి. అక్షర దోషాలు లేకుండా అందంగా మీ ప్రేమను తెలియచేయండి..

లేఖలు పంపిన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుంది. షరతులు వర్తిస్తాయి. రచనలు తిరిగి పంపబడవు. మీ రచనలు మాకు అందాల్సిన ఆఖరు తేది ఫిబ్రవరి 14, 2022.

మీ లేఖలు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]

Related Posts

2 Comments

  1. యువతకు ఈ శీర్షిక పట్ల ఆశక్తి ఉంటుంది .అలాగే పెద్ద వారు కూడా తమ గతాన్ని నెమరువేసుకుంటూ ఉంటారు.

Comments are closed.