ప్రేమ పంచితే బాగుంటుంది

ప్రేమ పంచితే బాగుంటుంది

ప్రేమ పంచితే బాగుంటుంది

కిరణ్, రూప ఆఫీస్ కి వెళ్తుండగా జుమ్మీ వాళ్ళకి అడ్డొస్తుంది. వాచ్మెన్ జుమ్మిని జాగ్రత్తగా చూసుకో నేను సాయంత్రం వస్తాం అని చెప్పి వెళ్ళిపోయింది రూప. అక్కడ జుమ్మి ఒక్క కుక్కనే కాదు ఎన్నో రకాల కుక్కలున్నాయి.  రూప కి కుక్కలు అంటే ఇష్టం.

ఆ ఇష్టంతోనే తన ఇంట్లో పెంచుకునేది. ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ కుక్కకి అనారోగ్యం కారణంగా చనిపోయింది. ఆ టైంలో రూప దగ్గర లేకపోవడం వల్ల తన బాధ ఇంకా ఎక్కువైంది. అప్పుడప్పుడు రోడ్డుమీద కనిపించే కుక్కలకు ఆహారం పెడుతూ ఉండేది. ఆ కుక్కలకు ఉన్న దెబ్బలు చూడలేక మందు రాసి కట్టు కట్టేది.

ఇలా కొన్ని రోజులు తర్వాత కిరణ్ ని పెళ్లి చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయింది. రూప ఉద్యోగం చేస్తున్న ఏదో దిగులు అసంతృప్తి ఉంటూనే ఉన్నాయి. అది గమనించిన కిరణ్ “ఏంటి… రూప ఎప్పుడు చూసిన దిగులుగానే కనబడతావు అసలు ఏమైంది?” అని అడిగాడు.

“తన దగ్గర ఉన్న కుక్క గురించి తన కుక్కలు అంటే ఇష్టం” అని చెప్పింది రూప. “కొంచెం సరదాగా అయితే నువ్వు జంతువు ప్రేమికురాలి అన్నమాట” అని అన్నాడు కిరణ్. ఒక నెల తర్వాత రూప పుట్టినరోజు రోజున ఒక చిన్న కుక్క పిల్లని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ కుక్క పిల్లతో గడిపి గతంలో జరిగిన సంఘటనను మర్చిపోయింది రూప. తన పక్కింట్లో ఐదు సంవత్సరాలు ఉండే పాప  ఉంది. ఆ పాప కూడా చిన్న కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం.

చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చి , “నాన్న… ఈ చిన్న కుక్క పిల్లని మనం పెంచుకుందాం” అని అడిగింది. “వద్దు ఆ కుక్కని పెంచుకోవద్దు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావా అక్కడే వదిలేయ్” అని చెప్పాడు ఆ పాప తండ్రి. ఆ చిన్న పాప ఏడుస్తూ ఒక గ్రౌండ్లో వదిలేసింది ఆ చిన్న కుక్క పిల్లని. ప్రతిరోజు చిన్న కుక్కపిల్లకి ఏదో ఆహారం తెచ్చి పెట్టేది అది చూసిన రూప తన మనసు కరిగిపోయింది.

‘ఆ కుక్క పిల్లను కూడా పెంచుకుందాము అనుకుంది రూప.’ ఈ విషయం కిరణ్ కి చెప్తే తను కూడా ఒప్పుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 50 కుక్కల్ని ఒక దగ్గరికి చేర్చి వాటి ఆలనా పాలనా చూసుకుంటుంది రూప. అప్పుడప్పుడు ఆ చిన్న పాప వచ్చి ఆ చిన్న కుక్క పిల్ల తో ఆడుకుంటూ ఉండేది. మనలో మానవత్వం మనుషుల మీదే కాదు మూగజీవాల మీద కూడా చూపిస్తే మనకే మంచిది. అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

నటించే మనుషులను నమ్మడం కంటే మూగజీవాలకు మన ప్రేమ పంచితే బాగుంటుంది. అవి మనతో చాలా విశ్వాసంగా ఉంటాయి. వాటికి ఎలాంటి కపట ప్రేమలు తెలియవు.

– మాధవి కాళ్ల

మనిషికి మనిషి తోడుంటే Previous post మనిషికి మనిషి తోడుంటే
ఎక్కడుంది మానవత్వం Next post ఎక్కడుంది మానవత్వం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close