ప్రేమ పాశం

ప్రేమ పాశం

మాటల కందని భావన
మనసును బందీచేస్తుంది
ప్రేమ పాశం!

ఆశ ఉన్నంత సేపు
అనుభవం వచ్చినంత వరకు

ప్రాణానికి ప్రాణం అంటోంది
సర్వస్వం త్యాగమని

మదిలో అలజడి వున్నా
అంతరంగాన్ని ఆదమరిచైనా

మాయం చేస్తుంది బంధం
మాటలకందని భావనతో

తలచే జ్ఞాపకమై తనవారి కోసం
హద్దులు చేరిపేసిన ఆలోచనతో

వర్ణించలేని అర్థమై
దాచుకున్న రూపం కోసం

పట్టిపీడిస్తుoటది ప్రేమపాశమై
ఎన్నిజన్మలైనా మరి…….?

– జి జయ

Related Posts