ప్రేమ విలువ

ప్రేమ విలువ

ప్రేమ విలువ దూరంలో తెలుస్తుంది
కన్నీటి విలువ నిజాయితీ
లో వుంటుంది అంటారు

వెలకట్టలేనిదిఈప్రపంచంలో వున్నది అంటే అది
నిజమైన ప్రేమ మాత్రమే

బంధాల నడుమ ప్రేమ
బహు రూపాల్లో కనిపించును

కొలువలేని విలువ కు
పాత్రలే లేవు
కొనలేనిప్రేమకు
హద్దులు లేవు

అర్హత చూడని ప్రేమ
అందలం లాంటిది
నమ్మకాల ముడులతో
బందీ అవుతుంది ప్రేమ

ఏమీ ఆశించని ప్రేమ
వేటిని శాసించని ప్రేమ
అన్నిటినీ మించినది
రోజులతో పాటు మారుతున్న
ప్రేమ విలువలు
వికటిస్తే విషతుల్యం
పంచి చూస్తే తెలుస్తుంది
దాని పరమార్థం ఇంకా
దానివిలువ అమృతతుల్యము
అదే మనిషి మనస్సు కు
ఇచ్చిన గొప్ప వరం……?

– జి జయ

Related Posts