ప్రేమ గా

ప్రేమగా…

మాధవి నాకు నీ డ్రెస్ ఇవ్వవే, ఒక్క సారి వేసుకుని ఫోటో దిగుతాను అంది లత. హా నేను ఇవ్వను ఇది నాది నాకు మాత్రమే సొంతం ఇది నేను ఇవ్వను అంది గట్టిగా డ్రెస్ పట్టుకుంటూ  మాధవి.
ఎందుకు ఇవ్వవే ఇవ్వు. ఓహ్ నీ లవర్ ఇచ్చాడు అని పెద్ద పోకడ కొడుతుంది ఇది. ఓ నీకే ఉన్నాడు లవర్ అంది మూతి తిప్పుకుంటూ లత.
అవునే, అవును. నాకు నా లవర్ కొని ఇచ్చాడు. అందుకే నేను దాచి పెట్టుకుంటా అంది మాధవి డ్రెస్ గుంజుకుంటూ..

ఎప్పటి దాకా పెట్టుకుంటావే? పెళ్లి అయ్యాక కూడా దాచుకుంటావా నీ మొగుడు ఇదెక్కడిది అని అడగడ ఏంది? అంది లత.

Love Express Your Emotional - Free photo on Pixabay

ఆ అడిగినా సరే నేను దీన్ని ఇక్కడే పెట్టీపోత ఇది ఎవరికీ ఇవ్వకూడదు అని అమ్మకు చెప్పి మరీ పోతా.. నీకెందుకు? ఇది నాది నేను ఇవ్వను అంటూ ఆ డ్రెస్ ను గుండెలకు హత్తుకుంది మాధవి.

*****

ఆ డ్రెస్ మాధవికి నందు కొని ఇచ్చాడు ప్రేమించే సమయంలో, నందు మాధవి వాళ్ళ ఇంటి దగ్గరే నాలుగు ఇళ్ళ అవతల ఉండే వాడు. కాలేజీలో చదువుతూ ఉండేవాడు. అతనిది పక్కనున్న పల్లెటూరు. వాళ్ళది చాలా పేద కుటుంబం.

ఒక్కడే కొడుకు ముగ్గురు ఆడపిల్లలు కావడంతో, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే నందుకు చదువు అంటే చాలా ఇష్టం కావడంతో బయటకు వచ్చి ఇక్కడ స్కాలర్ షిప్ మీద చదువుకుంటూ ఉంటున్నాడు.

అదే సమయంలో మాధవిని చూసాడు నందు. తను చాలా నచ్చింది నందుకు. మాధవి మొదట్లో పట్టించుకోక పోయినా కొన్ని రోజులు అయ్యేసరికి నందు ప్రేమలో పడిపోయింది. ఇద్దరు ప్రేమలో మునిగిపోయారు.

తల్లిదండ్రులకు తెలియకుండా అందరి కళ్ళు కప్పి సినిమాలకు, షికార్లకు తిరగడం మొదలు పెట్టారు. వాళ్ళ ప్రేమ బాగానే సాగింది. ఆ సమయం లోనే మాధవికి నందు డ్రెస్ కొని ఇచ్చాడు.
అది తెలుపు, ఆకుపచ్చ కలగలిసిన తెల్లని చుడీదార్. చూడగానే ఆకట్టుకునేలా సన్నని గీతలతో చాలా బాగుండేది.

నేను దాన్ని కావాలని అనుకున్నా కానీ నాకు అది దక్కలేదు. ఇక మాధవి, నందుల ప్రేమ కొన్నాళ్ళ వరకు బాగానే సాగింది. ఆ తర్వాత మాధవి అక్క లత ఎవరికీ చెప్పా పెట్టకుండా అసలు ఎవరికీ అనుమానం రాకుండా తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోవడంతో అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే లత ఇలా చేస్తుందని అసలు ఎవరూ ఊహించలేదు.

అంత నెమ్మది అయిన అమ్మాయి దించిన తల ఎత్తకుండా తన పనెంటో తాను చూసుకుంటూ వెళ్ళేది. అలాంటిది ఇలా చేసిందని తెలిస్తే మరి ఆశ్చర్య పోవడంలో తప్పు లేదుగా.. లత వెళ్లడం మాధవికి నరకం లా మారింది. తను కూడా ఎవరితో అయినా వెళ్ళిపోతుంది అని తన అన్నయ్య తన చుట్టూ పంజరం బిగించి, పరువు అనే బందిఖనాలో బిగించాడు.

కంచు గోడలు కట్టడంతో మాధవి, నందులు కలవడానికి వీలు లేకుండా అయ్యింది. కానీ నందు ఊరుకోలేదు మాధవి కి లెటర్ రాసి ఒక రోజు రమ్మని వెళ్ళిపోయి హాయిగా ఉందాం అని అన్నాడు మాధవి కూడా నందుతో వెళ్లడానికి రెడీ అయ్యింది..

ప్రేమగా…

Heart Love Red - Free vector graphic on Pixabay

అదే సమయంలో ..

మాధవి పెద్దక్క శారద పుట్టింటికి వచ్చింది పిల్లలతో, ఇక మాధవికి వెళ్లే వీలులేక పోయింది. అయినా, తెగించి ఒక రోజు మబ్బున అక్కను నిద్రలేపి అక్క నేను నందుతో వెళ్లిపోతున్నా అని చెప్పి బ్యాగ్ తీసుకుని బయలు దేరింది. కానీ, తలుపులు తెరిచి బయటకు వచ్చిన మాధవికి రాత్రంతా హోటల్ లో పని చేసి ప్రొద్దున్నే వస్తున్న అన్నయ్య కనిపించే సరికి భయపడి వెనక్కి వచ్చి బ్యాగ్ పక్కన పెట్టి ఎప్పటిలా పడుకుంది.

అది చూసి శారద గట్టిగా ఊపిరి పీల్చుకుని హమ్మయ్య అనుకుంది. ఎందుకంటే తమ్ముడు చండ శాసనుడు మరి పెద్దది అని కూడా చూడకుండా కొట్టినా కొడతాడు కోపం వస్తె ఎవరని కూడా చూడడు.. ఇక మాధవి కోసం ఎదురు చూసిన నందు మాధవి రాకపోయేసరికి మాధవి ని మర్చిపోయి తాను వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ( ఇంత తొందరగా మర్చిపోతే అది ప్రేమ అంటారా ? ) అంతకన్నా వెళ్ళి మాధవిని అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకునే ధైర్యం నందుకు అప్పటికి ఇంకా రాలేదు.

కానీ, నందుకు తన జీవితం అంటే ఏదో కసి. పేద వాడిగా పుట్టడం తన తప్పు కాదు కదా! తాను పేద వాడిని అని కొందరు చేసే హేళన అతని మనసును గాయపర్చింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని అనుకున్నాడు. అందుకే బస్ ఎక్కి చివరి స్టేజ్ లో దిగాడు.

*****

అదొక పెద్ద ఊరు, రకరకాల మనుషులు రకరకాల పనులు దొరికే చోటు అంటే బ్రతకడానికి కావాల్సిన పని దొరుకుతుంది. ఎంతో మందిని తన ఒడిలో దాచుకుంటూ ఉండే ఆ పట్టణం లాంటి ఊరులో తనకు ఏదైనా పని దొరుకుతుంది అనుకుని అందర్నీ వెళ్ళి అడిగాడు పని కోసం.

కానీ, నందుకు ఎక్కడా పని దొరకలేదు. కానీ, ఒక ఆంటీ పరిచయం అయ్యింది ఎలాగంటే నందు ఇంటి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు, ఒక ఇంట్లో పైన గది ఖాళీ ఉందని తెలిసి అందులో చేరిపోయాడు. పాపం ఆ ఇంటి ఓనర్ అయిన ఆంటీకి భర్త ఉన్నా దుబాయ్ లో ఉండడంతో ఇక్కడ ఒక్కత్తే ఉండేది. కాలక్షేపం కోసం నందుతో ముచ్చట్లు పెడుతూ ఉండేది. ఆ ముచ్చట్లు కాస్త చేతలకు దిగాయి.

నందుకు ఆ ఆంటీ ఒక్కతే ఉండడం, భర్త లేకపోవడం బాగా బలిసి ఉండడం కోరికతో వెర్రెక్కి కనిపించడం వల్ల, తొందరగానే వల వేసి పట్టాడు. అయితే నిజానికి నందుకి అలాంటి ఆలోచన లేదు కానీ ఆంటీ చేతలు డబుల్ మీనింగ్ డైలాగ్స్ చూసి, పాపం వేడి మీద ఉండడం వల్ల నందుకు డబ్బు ఆశ చూపించి తన కోరికలు తీర్చుకుంది.

 

File:Love life.jpg - Wikimedia Commons

ప్రేమగా…

దాంతో నందుకు అవసరాలు అన్ని తీరడం మొదలు అయ్యాయి. ఆంటీ ఇచ్చిన డబ్బుతో అక్కల పెళ్ళిళ్ళు చేశాడు. మంచి మంచి బట్టలు, తిండి, మందు, తిని, తాగేవాడు. దాంతో, కాస్త కండ పట్టి బలంగా తయారు అయ్యాడు ఇక్కడ నందు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండగా… అక్కడ మాధవి అన్నయ్య హఠాత్తుగా ఒక సంబంధం తెచ్చాడు. మాధవికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ, అన్నయ్యకు ఎదురు చెప్పే ధైర్యం లేకపోయింది. పైగా నందు జాడ ఎక్కడా లేక పోవడం వల్ల తనకు తాను ఏమి చేయలేకపోయింది. మాధవి ఆలోచిస్తూ వుండగానే పెళ్లి జరిగి పోయింది..

మాధవి కి పెళ్లి అయ్యి అప్పగింతలు అయ్యాక ఏడుస్తూ వెళ్లి కార్లో కూర్చుంది. కారు ఇక బయలు దేరుతుంది అనగా మాధవి భర్తను తోసేస్తూ, కిందకు దిగి వచ్చి తల్లిని కౌగిలించుకుని, తల్లి చెవిలో “అమ్మా నందు కొనిచ్చిన డ్రెస్ సందూకలో ఉంది అది ఎవరికీ ఇవ్వకు మళ్లీ నేను వచ్చి తీసుకుని వెళ్తాను” అని చెవిలో చెప్పి వెళ్లిపోయింది. అయ్యో తల్లిని వదిలి వెళ్ళలేక పోతుంది పాపం అని అమ్మలక్కలు అనుకున్నారు. కానీ, వారికి అసలు విషయం తెలియదు.

మాధవి అత్తారింట్లో బాగానే కలిసి పోయింది. కానీ, అత్తారింట్లో డ్రెస్ లు వేసుకునే అలవాటు లేకపోవడం వల్ల మాధవి డ్రెస్ పుట్టింటి లోనే ఉండి పోయింది. తాను పుట్టింటికి వచ్చినప్పుడల్లా మాధవి ఆ డ్రెస్ వేసుకుని ఆనందపడేది. అక్క పిల్లలు, అక్క అడిగినా, ఎవరికీ ఇవ్వకుండా సందూకలో దాచేది. మాధవి రానప్పుడు అక్క కూతురు వెళ్ళినా, ఆ డ్రెస్ ఒక్క సారి వేసుకుంటా అమ్మమ్మ అని అడిగినా, అమ్మో పిన్నికి తెలిస్తే చంపెస్తది అని పిల్లలకు చెప్పేది అమ్మమ్మ..

మరో వైపు నందు ఆంటీ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆంటీ భర్త రావడంతో ఆంటీ నందును కలవడం మానేసింది. మరి కాపురాన్ని కులగొట్టు కోలేదుగా, అయితే నందు చేతిలో డబ్బులు లేక సుఖాలకు అలవాటు పడి చాలా అప్పులు చేశాడు. ఆరు నెలల్లో అవి తీరాలి అంటే ఆంటీ భర్త వెళ్లాలి, ఆంటీ డబ్బులు ఇవ్వాలి. అరు నెలలు గడచి పోవడంతో ఆంటీ భర్త మళ్లీ దుబాయ్ కి వెళ్ళాడు…

అతను అలా వెళ్లగానే నందు ఆంటీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగాడు. అయితే ఆంటీ భర్త డబ్బుల గురించి లెక్కలు అడిగి తక్కువ ఇచ్చి వెళ్లడం వల్ల అలాగే తొందరలోనే వస్తాను అని చెప్పడం వల్ల అన్ని మానేసి మంచిగా ఉండాలి అనుకుందో లేదా నందును వదిలించుకోవాలి అనుకుందో కానీ, నందు డబ్బు అడగడంతో కొన్ని రోజులు రేపూ, మాపూ అంటూ వాయిదా వేసేది. నందుకు అప్పుల వాళ్ళు ఒత్తిడి చేయడంతో ఒక రోజు ఇస్తావా లేదా అంటూ గొడవ పడ్డాడు నందు..

అసలు ఎవడ్రా నువ్వు నన్ను డబ్బు అడగడానికి నా మొగుడు కూడా నన్ను ఇలా బెదిరించ లేదు. నీకేంట్రా డబ్బు ఇచ్చేది అంటూ ఆంటీ ఎదురు తిరిగే సరికి నందుకు ఏమీ చేయాలో అర్దం కాలేదు. దాంతో, కాస్త తగ్గి ఆంటీని బుజ్జగించి, అబ్బా ఊరుకో ఆంటీ ఏదో కోపంలో అన్నాను అంటూ ప్రేమ కురిపించాడు. దాంతో ఆంటీ కూల్ అయ్యింది. ఆ రాత్రి నందు బీర్ బిర్యానీ తెచ్చాడు. ఇద్దరూ తాగి, తిని ఎంజాయ్ చేశారు. నందు బీరువా తాళాలు ఎక్కడున్నాయో చూసుకుని, అంతకు ముందే అన్ని తెలుసు కాబట్టి ఆంటీ నిద్ర పోయాక డబ్బు, నగలు అన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్తున్న సమయంలో ఆంటీ నిద్రలేచి నందు డబ్బు, నగలు తీసుకుని వెళ్తున్నది చూసి అరవబోయింది.

Free photo Love Pair Romance Romantic Couple Relationship - Max Pixel

కానీ, నందు ఆమె అరవకుండా కత్తితో గొంతులో పొడిచి పారిపోయాడు ఆంటీ చనిపోయింది. జరిగింది తెల్లారి పని మనిషి చూసి అందర్నీ పిలిచి చెప్పడంతో పోలీసులు గంటలో నందును పట్టుకున్నారు. నందు నేరం చేశాడు అని ఒప్పుకోవడం వల్ల అతన్ని జైల్లో వేశారు. అలా నందు జీవితం ముగిసి పోయింది. మూడో రోజు పుట్టింటికి వచ్చిన మాధవి దగ్గరికి వాళ్ళ అన్నయ్య పేపర్ తెచ్చి చూపిస్తూ ఈ పిల్లగాడు మన పక్కింట్లో ఉండేవాడు.

వాడు ఎవర్నో చంపేశాడు అంట అంటూ ఆ వార్తను చదివి వినిపించాడు. మాధవి ఆ పేపర్ లాక్కుని మొత్తం చదివి గుండెలపై చేయి వేసుకుంది. అమ్మో నేను అతనితో వెళ్తే ఎలా ఉండేదో అనుకుంటూ భయపడింది. అయినా నందు ఇచ్చిన డ్రెస్ ఎవరికీ ఇవ్వలేక పోయింది. తర్వాత మాధవికి ఒక పాప, బాబు పుట్టారు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. మాధవి కూతురు కూడా ఆ డ్రెస్ మీద మనసు పడింది అయినా మాధవి దాన్ని ఇవ్వలేదు.

ఇష్టం ఉన్నప్పుడల్లా పుట్టింటికి వచ్చి దాన్ని తనివి తీరా చూసుకుని వెళ్ళేది ఎన్నో సార్లు అన్నయ్య, వదిన, తల్లి అక్కలు అడిగినా ఎవరికీ ఇవ్వలేక పోయింది. ఇప్పుడు మాధవికి తల్లి లేదు కాల ప్రవాహంలో అందరూ దూరం అయ్యారు మాధవి కూతురికి పిల్లలు కూడా పుట్టారు. అయినా ఇప్పటికీ నందు ప్రేమగా కొనిచ్చిన డ్రెస్ ఎవరికీ ఇవ్వకుండా తాను పెట్టుకునే దిండులో దాచుకుంది. తన ప్రాణం పోయే వరకు అది తనతోనే ఉంటుంది కావచ్చు..

మొదటి ప్రేమ ను ఎవరూ జీవితంలో మర్చిపోలేరు అనుకోవడానికి మాధవి ఒక ఉదాహరణ మాత్రమే…

మాధవి ప్రాణాలతో ఇంకా ఉంది తన ప్రేమ కూడా కానీ నందు??

దేవకీ

Related Posts