ప్రేమలేఖ

ప్రేమలేఖ

అమ్మకి అంకితం.
అమ్మప్రేమ అపురూప మైనది అనురాగపు విరుల గుత్తి. అష్టైశ్వర్యాలు కూడా సరిరాని అమ్మ ప్రేమ జీవిత ప్రయాణములో ప్రసవ వేదన నుండి మొదలై మధుర పాశంలా సాగుతుంది అమ్మ ప్రేమ.
అనుభూతికి అక్షరంలా, స్నేహానికి చిరునామలా, శ్రుతి మించిన అభిమానంలా, నమ్మకమే నాణ్యతగా
నిలిచిపోతుంది అమ్మ ప్రేమ… నిను కోరిన ఒకేఒక్క జీవి జగతిలో అమ్మ ప్రేమ నిను తాకిననాడే పొరలిన ఆనందం.
మంచి మనసుకు మార్కు లాంటిది అమ్మ ప్రేమ చీకటి వెలుగుల సయ్యాటలో చిరు దీపమై వెలిగేది ఒకే ఒక్కటి అదే అమ్మ ప్రేమ ప్రేమే ప్రాణం ప్రాణమే ప్రేమ గా నిర్వచనం అమ్మ ప్రేమ అది పొందగలిగిన రోజులు అమృతమయం లేనిచో హృదయ గోష అమ్మ ప్రేమ కోసం తపించే ప్రతి జీవి అజరామరం
– జి.జయ

Related Posts

1 Comment

Comments are closed.