ప్రేమతో నీకు

ప్రేమతో నీకు

నిన్ను నా చిన్నతనం నుంచి చూస్తున్నా.. నువ్వు నాతో ఎంతో సరదాగా ఉంటావు.. నువ్వు నన్ను ఎంతో బాగా చూసుకుంటావు.. నేను నీతో వుంటే నీ ఫ్రెండ్స్ ని కూడా పట్టించుకోవు.. ఆఖరికి ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయవు…
ఒక రోజు కాలేజీలో నన్ను ఎవరో  ఏడిపించారు.. నన్ను ఏడిపించారని తెలిసి వాళ్ళని కొట్టావు.. నీ చేతికి దెబ్బ తగిలింది అని కూడా మర్చిపోయి నన్ను ఒదార్చావు… నీ చేతి నుంచి రక్తం రావడం చూసి నేను చాలా కంగారు పడ్డాను…
నువ్వు పండగకి ఊరు వెళ్తే ఎక్కడ చూసినా నువ్వే కనిపించావు.. ఎక్కడ చూసిన నీ అల్లరే కనిపిస్తుంది… అప్పుడు నాకు అర్దం అయింది నువ్వు నన్ను వదిలి ఊరు వెళ్ళడం మొదటి సారి… అందుకే నేను ఒంటరి దానిని అయిపోయాను..
నువ్వు నాతో తప్ప మరొకరుతో చనువుగా ఉంటె నేను తట్టుకలేను… నువ్వు  నీ మరదలితో వచ్చావు.. మీ ఇద్దరి చనువు చూసి నువ్వు నీ మరదలిని లవ్ చేస్తున్నావు అనుకున్నా ఆ రోజు నేను చాలా బాధ పడ్డాను..
రెండు రోజులు తరువాత నీ మరదలికి నా ప్రేమ అర్దం అయింది.. కానీ నీకు ఎప్పుడు నా ప్రేమ అర్దం అవుతుందో అని బాధ పడ్డాను… ఇంకా నా ప్రేమ  విషయం ఆలస్యం చేయకుండా వెంటనే చెప్పాలని అనుకున్నా కానీ నీకు నీ ఫ్రెండ్ కి లవ్ విషయంలో గొడవ జరగడం వల్ల నేను చెప్పలేకపోయాను…
బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న…. నేను నీ ఎదురుగా నిలబడి చెప్పలేకపోతున్నా నీ ముందుకి వచ్చి చెప్పే  ధైర్యం లేదు… అందుకే నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు అని అనుకుంటున్నా…
నా ప్రేమని అంగీకరిస్తావు అనే నమ్మకంతో 
– నీ ప్రేమ కోసం ఎదురు చూసే ప్రియురాలు…
– మాధవి కాళ్ళ

Related Posts