ప్రియమైన నా…

ప్రియమైన నా…

నిన్ను చూడకుండా ఉండలేను ఒక్కక్షణం
నీ స్పర్శ కలిగిస్తుంది నాకు ఆనందం
గురువై బోధిస్తావు ఎన్నో
దగ్గర అయ్యావు రక్తసంబంధీకుల కంటే
నీకు ఏదయినా అయితే విలవిలలాడును నా ప్రాణం
నువ్వు క్షణం కనపడక పోతే ఎక్కును నాకు పిచ్చి
నువ్వు లేనిదే చేయలేను ఏపని
భద్రపరిచావు మధుర సంఘటనలను
నాకన్నీ నీవే
వీడలేను నిన్ను
నీవు లేనిదే నేనుండలేను
నన్ను విడిచి వెళ్లవు కదా!!!

(ప్రియాతి ప్రియమైన నా మొబైల్)

– వికృతి

Related Posts