పుడమి మోదం

పుడమి మోదం

సూర్యతాపంతో వేడెక్కిన మబ్బులు
కడలి‌ చెలికాని కోరి ఆవిరి సఖితో కలసి
వర్షపు చినుకులని వర్షించగా
పుడమి పులకిస్తుంది

ప్రకృతి కాంత సంతసిస్తుంది
నెమలి నాట్యమాడుతుంది
చెట్టు చేమలు కాంతివంతమవుతాయి
చెలమలు పరవళ్ళు తొక్కుతాయి
అలుపెరుగని పక్షులు వెచ్చగా
తమ జతకాని చెంత గూటికి చేరతాయి
పూవులు కిలకిల నవ్వుతూ విరబూస్తాయి
పిల్లలు కేరింతలతో మురిసిపోతారు

వయసుతో నిమిత్తమేమి లేకుండా
కుల మత బేధ భావాలు లేకుండా
అందరినీ సమానంగా చూస్తుంది
అందరికీ‌ ఒకేలా ఆనందాన్ని పంచుతుంది

బీటలు వారిన నేలమ్మ మామూలు స్థితికొస్తుంది
పంటకాలువలు పరవళ్ళతో కళకళలాడేను
రైతన్నకంట తడి పుట్టించేను
అతివృష్టైనా అనావృష్టైనా కావచ్చు
ఆనందభాష్పాలైనా, కన్నీరైనా కావచ్చు

ఏదేమైనా ప్రకృతి పులకిస్తుంది.
వర్షం మోదం పంచుతుంది.

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts