పునర్జన్మ

పునర్జన్మ

దివారాత్రాలు విరామమెరుగక..
నన్ను వెంటాడి వేధిస్తున్న…
విచ్చుకత్తుల్లాంటి ఆలోచనలు..
నా మది మందిరాన్ని…
విచ్చిన్నం చేస్తూనే ఉన్నాయి..
ఇక అలుపొచ్చి ..
ఆగిపోయాయేమో అనుకున్నా..
వేదనతో మరణించిన…
అంతరంగ భావనలు..
ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడే..
అక్షరాలుగా పునర్జన్మ పొందాయి..

– మామిడాల శైలజ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *