పురుషులందు పుణ్య పురుషులు వేరయా

పురుషులందు పుణ్య పురుషులు వేరయా

పురుషులందు పుణ్య పురుషులు వేరయా

ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉన్నట్టే, ప్రతి మహిళా విజయం వెనక మగాడు కూడా ఉంటాడు. అయితే స్త్రీ తెలిసినంతగా పురుషుడు తెలలియడు. తెలియాల్సిన అవసరం లేదని అతను అనుకోవడమే అందుకు కారణం. అయినా మహిళలు ఊరుకోరు. నేను ఇది సాధించాను అంటే కారణం నా భర్త, పిల్లలు అంటూ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం కద్దు.

మరి మహిళలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, ప్రత్యేకంగా చూస్తారు. మహిళా ఏడిస్తే కరిగి నీరవుతారు. ఆమెకి ఏ ఆపద వచ్చినా ముందుంటారు. ఇంకో మగాడు ఎడిపిస్తున్నాడు అంటే వాడిని చంపడానికి వెనకాడరు. మరి మగాళ్లకు బాధలు లేవా? వారు ఎడవరా? వారికి ఫీలింగ్స్ లేవా? ఆనందాలు అక్కరలేదా అంటే మగాడికి బాధలు ఉంటాయి. కన్నీళ్ళు వస్తాయి. ఆనందం ఉంటుంది. ఫీలింగ్స్ ఉంటాయి. కాకపోతే అవన్నీ బయటకు చెప్పుకోలేడు.

ఎందుకంటే దానికి కూడా మనమే కారణం. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు నువ్వెంట్రా మగడివి, అడదానిలా ఎడుస్తావు అంటూ మనసులో గట్టిగా స్థిర పరచి, మగాడు ఎంత బాధనైనా తట్టు కోవాలి, ఎడవకుడదు, పిరికి వాడిలా పారిపోకుడదు అంటూ చెప్పడం వల్లే వారికి బాధలు ఉన్నా, ఏడుపు వచ్చినా ఒంటరిగా ఏడుస్తారు తప్ప బయట పడరు.

కానీ ఆడవాళ్ళు అలా కాదు, సున్నితమైన వారని మొదటే ముద్ర వేస్తారు కాబట్టి వారు ఎలాంటి బాధలు పడలేక బయట పడుతూ ఉంటారు. నిజానికి ఆడవారి కన్నా మగవారు చాలా సున్నితమైన వారని, ఏదైనా దాచుకోలేక నలుగురికి పంచుకొలేక వారిలో వారు భయపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మన సమాజం పురుషుడు అంటే ధైర్యంగా ఉండాలని నూరిపోస్తారు కానీ నిజానికి పురుషుడికి స్త్రీకి ఉన్నంత ధైర్యం లేదు.స్త్రీ తీసుకునేంత వేగంగా పురుషుడు నిర్ణయాలు తీసుకోలేడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.

ఒక బిజినెస్ మేన్ చాలా అప్పుల పాలు అయ్యి, అవి తీర్చలేక ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతని భార్య, భర్త చేసిన ప్రతి అప్పు ధైర్యంగా ముందుకు వెళ్ళి తీర్చింది. అతనికి ఎలాంటి మచ్చ రాకుండా చేసింది. మరి మాగాడు అలా చేయగలడా అంటే లేదు అనే అంటాను నేను. అదే అంటే భార్య చేసిన పనే అతను ధైర్యంగా చేయొచ్చు.

కానీ అవమానంగా భావించాడు. తనువు చాలించాడు. అది సరియైన నిర్ణయం కాదు. దీనిని బట్టి పురుషుడు చాలా సున్నితమైన వారని అర్థం అవుతుంది. మనం మరో కోణం లో కూడా ఆలోచించాలి పురుషుడు పెళ్లి అయినా కాకున్నా తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్ళ, తమ్ముళ్ళ బాధ్యతలు తీసుకుని వారందర్నీ చదివించి, పెళ్ళిళ్ళు చేసి, తానూ పెళ్లి చేసుకుని, సమాజం లో మంచి పేరు తెచ్చుకున్న వారు లేకపోలేదు.

వారందరూ నిజాన్ని గ్రహించారు కాబట్టి పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టుగా ఉన్నారు. పురుషుడు తన బాధను, వేదనను ఎవరికీ ఎందుకు చెప్పలేడు అంటే సమాజం ఏమంటుందో అని అనుకుంటాడు. నిజానికి జరిగేది కూడా అదే ఏంట్రా అడదానిలా ఏడుస్తూ ఉన్నావు అని స్నేహితులే ఎగతాళి చేస్తే ఇంకా అతను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మదన పడిపోతుంటారు.

కానీ అదే పురుషుడి భార్య అన్తరే ఒక స్త్రీ తన భర్త గురించి అందరికీ ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. మావారు ఇలా, మా వారు అలా అంటూ గొప్పగా చెప్పుకుంటుంది. అదే భార్య చనిపోతే భర్త చాలా బెంగపడతాడు. నిజానికి ఆడవారు చిన్నతనం లో అన్నదమ్ముల అండతో ఉంటే, పెళ్లయ్యాక భర్త, పిల్లలు అండ తో బ్రతుకుతుంది.

కానీ పురుషుడు అలా కాదు చిన్నప్పుడు తల్లి అండగా ఉంటే పెళ్లయ్యాక భార్య అండ వుంటుంది. పిల్లలు పక్షిలా ఎగిరిపోయాయి పురుషుడు ఏకాకి అవుతాడు. ఉదాహరణలు కోకొల్లలు సినిమా నటుడు రగనాధ్, నుండి నిన్నటి కృష్ణ గారి వరకు మానసికంగా కృంగి పోయిన వారే, కానీ ఆడవారు అలా కాదు మానసికంగా చాలా దృఢంగా ఉంటూ సభ పిల్లలని చదివించి మంచి స్థితికి తీసుకొని వస్తారు.

వారిలో కూడా ఇలాంటివారు ఎక్కడో ఒకచోట మనకి కనిపిస్తూనే ఉంటారు ఉదాహరణకి ఒక వ్యక్తి తన భార్య చనిపోయినా కూడా పిల్లలు చిన్న వాళ్ళయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా తన పిల్లలకు కష్టపడుతూ వారిని ఒక మంచి స్థితికి తీసుకొని రావడం నేను చూశాను. భర్త ఎలాంటి వాడైనా నెట్టుకు వచ్చే మహిళలు ఉన్నారు భార్య ఎలాంటిదైనా గుట్టుగా భరించే భర్తలు ఉన్నారు.

పిల్లల కోసం తన కుటుంబం కోసం ఎంతటి శ్రమకైనా వచ్చే కష్టపడి పురుషులు కూడా ఉన్నారు. పొట్టిగా ఉన్నా,పొడుగు అయినా, తెల్లగాఉన్నా, నల్లగా ఉన్నా ఆకారం ఎలా ఉన్నా. భార్యకు భరోసాగా, పిల్లలకు బాధ్యతగా, అక్క చెల్లెలకు అండదండగా నిలుస్తూ, సమాజంలో ఒక మంచిపేరు, హోదా తెచ్చుకుంటూ సమాజాన్ని ఉద్ధరించకపోయినా, తన కుటుంబం వరకు తాను బాధ్యతగా నడుచుకునే పురుషులు ఎందరో. నష్టాలను, బాధలను, కన్నీళ్లను, కష్టాలను తమలోనే అనుభవిస్తూ జీవన పయనం సాగిస్తున్న మగ మహారాజులు ఎందరో, వారoదరికి శతకోటి వందనాలు తెలియచేస్తూ ప్రతి స్త్రీ నీ సొదరిలా భావించి,తమకు అనుమానాలు, అవమానాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటూ మంచికి మారుపేరులా నిలిచే పురుషులకు, పురుషుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు 🙏 రాజులందు మగ మహారాజులు వేరయా 

– భవ్య చారు

ఎదురీత Previous post ఎదురీత
అనుభూతుల వల Next post అనుభూతుల వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *