రాజకీయం vs డబ్బు

రాజకీయం vs డబ్బు

రాజకీయం అంటే మనకెందుకులే మనకు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటు వేద్దాంలే అని ఓ ఇంటి గృహిణి అనుకోని మరో ఆమెతో చెపుతుంది…

చూడు వదిన మనకు ఆ రాజకీయాలు ఏం తెలుసు చెప్పు ఓటుకు ఇంత అని డబ్బులు ఇస్తారు అట వాటిని తీసుకోని నాకు నా పిల్లలకు మంచి బట్టలు కొనుకోవాలి అని చెపుతుంది ఓ గృహిణి…

మరో ఆమె అవును నేనూ కూడా ఆ డబ్బుతో ఇంట్లోకి ఏవైనా అవసరం అయినవి కొనుక్కోవాలి అని చెపుతుంది…

వీరి సంభాషణ వింటూ అక్కడ పక్కన కూర్చున్న ఒక ఆమె అడిగింది ఆ ఆడవాళ్లను.. అంటే ఓటు అంటే మీకు వచ్చే సొమ్ము అంటారా అని అడిగింది.. మీ ఓటుకు విలువ లేదా అని ప్రశ్నించింది అక్కడి ఆడవారిని…

మా ఓటుకూ ఏం విలువో మాకూ తెలీదు ఆ రాజకీయం గురించి మాకు అసలే తెలీదు వచ్చే డబ్బుని మేమెందుకు వదులుకోవాలి అని చెప్పారు ఆమె తో అక్కడి ఆడవాళ్లు..

అప్పుడు ఆమె చెప్పింది వీరితో..
ఓటు అంటే ఒక ఆయుధం…
మీ ఇంటి కోసం మీరు ఎలా అయితే తాపత్రయం పడుతారో అలాగే ఈ దేశం బాగు కోసమే ఈ రాజకీయం..

ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే ప్రజాస్వామ్యమే ఈ రాజకీయం… అంతా ఇలా మనకెందుకులే అనుకుంటే అర్హత లేని నాయకులు రాజ్యం ఎలడానికి సింహాసనం ఎక్కుతారు…

ఒక్కసారి ఆలోచించండి మీకు ఓటుకు ఇంత ఇస్తాము అంటున్నారు అంటే పదవిలోకి వచ్చిన తరువాత తిరిగి రెండింతలు సంపాదించుకోరా ఇటువంటి నాయకులు…

పైగా మన పైన ఇంకా ఇంకా భారం మోపుతారు నిత్యావసరాలలో కరెంట్ అలా వగైరా ద్వారా వాళ్ళు ఇచ్చిన డబ్బుని మళ్ళీ మన నుండి లాక్కొంటారు.. కాబట్టి ఓటరు అంటే మనము డబ్బుకు లొంగకుండా మన ఓటు హక్కునూ వినియోగించుకుంటే బాగుంటుంది…

అలాగే యువత కూడా రాజకీయాలలోకి వస్తే రాజకీయ చరిత్ర రాతనే మార్చేయొచ్చు… అనుభవం కన్న మంచి చేయాలి అనే సంకల్ప బలం చాలా గొప్పది.. యువత తలుచుకుంటే కానిది అంటూ ఉంటుందా…?

– కళ

Related Posts

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *