రాధా మాధవం

రాధా మాధవం

రాధ మనసు
కన్నయ్య వ్యక్తిత్వం తెలుసుకుంటే
రాధామాధవుల
ప్రేమ తత్త్వం
కొంతన్నా అవగతం అవుతుంది..
అందుకే
వారి ఇరువురి నడుమ ప్రేమ తరతరాలకే కాదు,
యుగ యుగాలకి అద్భుతంగా,
ఆశ్చర్యంగా,
ఆనందంగా
అనిపిస్తుంది.
ప్రేమలో ఔన్నత్యం తెలియాలంటే
రాధ సమర్పణా భావం,
ఆర్తి తెలియాలి…
అంతటి ప్రేమకు
ఆ కన్నయ్య మాత్రమే అర్హుడు.
అవ్యక్తమైన అనురాగం అవ్యాజమైన ప్రేమ
వర్ణనాతీతమైన వాత్సల్యం
చిలిపి అల్లర్ల చిన్మయానందం
రమ్య మనోహర రాసలీల
క్రీడావినోదం
అసలైన ప్రేమకు అపురూప నిర్వచనం…
అలాంటి ప్రేమ జీవితంలో ప్రతీ మనసున్న మనిషి పరితపించేలా రాధామాధవ తత్వం తెలియజేస్తుంది…

– భాగ్యలక్ష్మి

Related Posts