రాధే శ్యామ్ మూవీ రివ్యూ

రాధే శ్యామ్ మూవీ రివ్యూ

రాధే శ్యామ్ ఈ సినిమాకి ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. రెండు సంవత్సరాలునుంచీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.. ఒకానొక సమయంలో ఓటిటి లో కూడా వస్తుంది అని అన్నారు. కానీ ఈరోజు నుంచి థియేటర్స్ లో జాతర చేయ్యనుంది రాధే శ్యామ్ సినిమా… మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ ఏంటి?

కథ:- విక్రమాదిత్య (ప్రభాస్) ఒక పామిస్ట్. చేతిని చూసి జాతకం చెప్పేయ్యగలడు. అలాంటిది తను ఒక రైలు ప్రయాణంలో ప్రేరణ (పూజా హెగ్డే) ని చూసి ప్రేమలో పడతాడు.

ముందు ప్రేరణ ప్రేమని ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుంటుంది. కానీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఒక్క ట్విస్ట్ తో విక్రమాదిత్య కథ అంతా మారిపోతుంది.

ఆ ట్విస్ట్ ఏంటి? విక్రమాదిత్య విధితో పోరాడి ప్రేమని గెలవగాలడా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ:- మనం పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లలో చూసినట్టు గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ ఐ ఫీస్ట్ లో ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎక్కడా తగ్గలేదు. 

ఇక స్టొరీ చాలా సింపుల్ అయినా కూడా మనల్ని గ్రాబ్ చేసే ప్రయత్నం చేస్తుంది. బాహుబలి సినిమా తర్వాత రిలీజైన సాహో తో ఫ్లాప్ సాధించిన ప్రభాస్ ఈ సినిమాతో హిట్ కొడతాడని అందరికి హోప్ ముందునుంచే ఉంది.

నిజం చెప్పాలంటే డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ తన మొదటి సినిమా జిల్ తోనే హిట్ కొట్టకపోయినా ఈ సినిమాతో ముందుకు వచ్చారు.

సినిమా మొదటినుండి కూడా ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని అది చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. అలాగే ట్రైలర్ లో అందరిని ఎక్సైట్ చేస్తూ షిప్ ఎపిసోడ్ కూడా ఉండడం చూశాము.

అయితే అవి స్క్రీన్ పైన ఇంకా ఎఫెక్టివ్ గా ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు అని అనిపించింది. సాంగ్స్ స్క్రీన్ పైన ఇంకా బాగున్నాయి.

పర్ఫార్మెన్స్:- ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విక్రమాదిత్య గా చేసిన ప్రభాస్ నటన చాలా ఇంప్రూవ్ అయ్యింది. డార్లింగ్ లాంటి సినిమాలో లవర్ బాయ్ గా ఎలా ఉన్నాడో అలా కనిపిస్తాడు మనకి ఈ సినిమాలో.

అలాగే తన లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా  జగపతిబాబు లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళ జీవితం లేదా ఫ్యూచర్ చెప్పే సీన్స్ కొంచం ఇంటరెస్టింగ్ గా డిజైన్ చేశారు.

అలాగే రొమాంటిక్ యాంగిల్ లో కూడా బాగా చూపించారు. తన లుక్స్ తోనే చాలా మాట్లాడడానికి ట్రై చేశారు. అలాగే ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ లో హీరో ఫీలింగ్ ని మనం కూడా ఫీల్ అవుతాము. 

ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే, తను అందం తో బానే నెట్టుకొచ్చింది కానీ నటన బాలేదు. ముఖ్యంగా ప్రభాస్, పూజా హెగ్డే ల కెమిస్ట్రీ ఏమి అనిపించదు.

అలాగే హీరోయిన్, హీరోల మధ్య వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నా కూడా మనం అంత ఫీల్ అవ్వలేకపోతాము. కానీ ప్రీ-ఇంటర్వెల్, ప్రీ క్లైమ్యాక్స్ దగ్గర వచ్చే సీక్వెంసేస్ చాలా బాగున్నాయి.

విజువల్ పరంగా మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఇక ఈ సినిమాలో పెద్దగా సపోర్టింగ్ క్యారక్టర్స్ లో ఎవరూ లేరు. సినిమా అంతా హీరో, హీరోయిన్ లపైనే నడుస్తుంది.

కొన్నిల్యాగ్ సీన్స్ ఉన్నాయి. వాటిని ట్రిమ్ చేసినా కూడా ఏమి అయ్యిండేది కాదు. కొంచం కామెడి పర్లేదు అని అనిపిస్తుంది. 

బాటం లైన్:- సోల్ లేని శ్యామ్ 

రేటింగ్:- 2.5/5

చివరగా:- పాత స్టొరీ అయినా కొత్తగా చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కానీ హీరో, హీరొయిన్ ల మధ్య ఉండే సీన్లలో వాళ్ళ యాక్టింగ్ ఇంకా బాగుంటే బాగుండేది. అలాగే పూజా హెగ్డే బదులు వేరే నటిని సెలెక్ట్ చేసినా బాగుండేదేమో… 

 

Related Posts