రాజకీయం అంటే

రాజకీయం అంటే

రాక్షసంగా
జనాలను
క్షీణించే విధంగా
యమదూతలుగా
వాడుకునేదే రాజకీయం

సినిమాలోని డైలాగ్ వేరేగా ఉంటుంది. కానీ ఇది నేను కనిపెట్టిన మాటలు.

నిజమే రాక్షసంగా రాజకీయ నాయకులు జనాల మదిలో ముందు కులం అనే మత్తు మందును చల్లుతారు. ఆ మత్తులో ఉన్న కుల పెద్దను పిలిచి ,వాడికి డబ్బు ఆశ చూపించి , మీ కులపు ఓట్లన్నీ మాకే పడాలి అనే వాగ్ధానం తీసుకుంటారు.

ఇలా రకరకాల కులపు వారిని పిలిచి డబ్బు అనే మత్తు లో ముంచి,  నువ్వేది అడిగితే అది ఇస్తాం.  కానీ మీ ఓట్లు మాత్రం మాకే కావాలని అంటారు.

తర్వాత వాడు వెళ్లి కులం లోని అందర్నీ పిలిచి అందరితో హారతి పెట్టీ వాగ్ధానం చేయిస్తాడు. కుల పెద్ద మాటకు తిరుగు ఉండదు.

ఇక కుల పెద్ద ఎవరికీ కావాల్సిన వాటిని వారికి అందజేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తాడు. మగాళ్లకి డబ్బు, మందు,బిర్యానీ , ఆడవారికి చీరలు, కుంకుమ భరిణల తో పాటు తాగే వారికి మందు కూడా ఇస్తారు.

డబ్బు వెదజల్లుతూ ప్రజలను మత్తులో మంచి మందు పోసి అయిదేళ్ల వారి జీవితాన్ని తమ గుప్పెటలో పెట్టుకుంటారు.

పాపం పిచ్చి జనాలు ఆ పూట కు మందు, బిర్యానీ, డబ్బు ,చీరలకు ఆశపడి తమ విలువైన ఓటు హక్కును అమ్మేసి వారి కబంధ హస్తాల్లో ఇరుక్కుంటారు.

ఏదైనా సమస్య వచ్చి వెళ్తే అప్పుడు పైసలు తీసుకున్నవూ కదరా వెళ్ళు అని అనిపించుకుంటారు.

మా ఊర్లో కూడా ఎలక్షన్ లు వచ్చాయి.చిన్న చిన్న కార్య కర్తల ఇళ్లలో లెక్కకు మించి బీర్,మందు డబ్బాలు, మరో వైపు చీరలు ఎవరికీ నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు,

అనే బంపర్ ఆఫర్ పెడితే జనం ఊరుకుంటారా, అసలే మన జనం ఫ్రీ గా వస్తె ఫినాయిల్ కూడా తాగే రకాలు.( ఇందుకు మేము కూడా అతితులం కాము, ఎందుకంటే అక్కడ చీరలు మరి)

రాజకీయ నాయకుడికి ఎవర్ని ఎక్కడ ఎలా లోంగదియాలో బాగా తెలుసు.కాబట్టి మేము కూడా చీరలు, డబ్బు తీసుకున్నాం. మనిషికి అయిదు వందలు ఇచ్చారు. ఓటు వేయడానికి వెళ్తుంటే మరి వేయాలి మనకే అంటూ సైగలు చేశారు.

మాకు ప్రత్యేక అభిమానం ఉన్న వారికి వారు చెప్పినట్టు కాకుండా మాకు నచ్చిన వారికి వేశాం అనుకోండి. తిరిగి వచ్చేటప్పుడు కూడా మనకే వేశారా అంటూ ప్రశ్నలు , ఆ వేశాం అంటూ దాటుకుని వచ్చేశాం.

కానీ కొన్ని రోజులకే ఆ పార్టీ వీడి పోయి, ఆ నాయకుడు మరణించాడు, అనే కన్నా చంపారు అనడం మంచిది. అది తెలిసి మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నాము..

ఇంతకీ చెప్పొచ్చేదమిటంటే డబ్బుంటే చాలు, ఎవరైనా వాడు హంతకుడు అయినా, నేరస్థుడు, రేపిస్ట్ అయినా ,ఎంత చెత్త వెధవ అయినా గెలిచి తీరతారు. మనల్ని వేధవల్ని చేస్తారు.

అందుకే ఓ యువత ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రశ్నించు, వారు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఓటు వేయమని ధర్నాలు దీక్షలు చేయండి.

ఇన్ని చేసినా కేసులు పెట్టీ లోపల వేసి కుళ్ళ బోడుస్తారు అనేది మర్చిపోకు. నీ ఓటు విలువైంది. కాబట్టి నోటు ను నమ్ముకోకుండా ఓటు నీ నమ్ముకో , నీ ఓటే నీ చేతిలో ఉన్న ఆయుధం అని గుర్తు పెట్టుకో…

 

 

-భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *