రక్షాబంధన్

రక్షాబంధన్

అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ళు
అనుబంధం- రక్షాబంధన్

ప్రేమను పంచే పేగు బంధం
ఆప్యాయతల అంతరంగం

భాదను పంచుకునే భాగ్యం
బరోసాల సంప్రదాయాలు

కష్ట సుఖాల కంకణాలు
బలమైన అండ దండలు

వెన్నంటి వుండే తలంపు
అపురూప అనుబంధాలు

తీపి చెలిమిల గొప్పతనం
అమరిన రక్తసంబంధం

కలిసి పెరిగిన ఇంటికి
మధురమైనమనసు
తోరణాలు

కమ్మని మమతల పుట్టినిల్లు
ప్రాణంలాంటితోబుట్టువులు

ఒకే చెట్టు కొమ్మలు
అందాల ఇంటి దీపాలు

అంతులేని అభిమానం
చెరగని బంధాలకు రక్ష
అదే అందరికీ శ్రీ రామ రక్ష!

– జి జయ

Related Posts