రక్షా బంధనం
పూర్వము శ్రావణ పూర్ణిమ దినము
ధార్మిక జీవన ప్రారంభము
ఆరంభించిరి వేదాధ్యయనం
ద్విజులందరు ధరించి యజ్ణోపవీతం
పఠించు చుండిరి గాయత్రి మంత్రం
తొల్లి శచీదేవి భర్తకు కట్టి రక్షాబంధనం
దానవులను గెలువగ నింపె నింద్రులో విజయం ఇంధనం
కృష్ణుని గాయానికి ద్రౌపది కట్టిన చేలాంచలం
రక్షగ మారగ నామెకి తప్పెను అవమానం
బాహుబలి పురుషోత్తమ సందర్శనం
అలెగ్జాండర్ సతి రొక్సానాకితెలిపె రక్షాబంధన ఉపయోగం
కట్టి తప్పించెను భర్త మరణం
అన్నదమ్ముల ఆదరముపొందుట
కది ఆయెను ఆలంబనం
అక్కాచెల్లెళ్ళజీవితాలలో పంచును ఆనందం
నిండు పౌర్ణమి వెలుగులండగ నిలిచి నింపును సంతోషం
మనుషుల నడుమనిది పెంచును మైత్రీభావం
పర్యావరణానికి కూడా కడదాం
ఒక మొక్క పెంచుతూ రక్షా బంధనం
జగతిని చేద్దాం పలు శుభాల కి నిలయం
కడుతూ యుధ్ధానికి శాంతిరక్షాబంధనం
-ఉపద్రష్ట సుబ్బలక్ష్మి