రంజాన్
రంజాన్ ముస్లిం మతస్థులకు పవిత్రమైన పండుగ. నెల రోజుల ఉపవాసం తర్వాత
ఈద్ పండుగ జరుపుకుంటారు. నవాజ్
ప్రతి సంవత్సరము ముప్ఫై రోజులపాటు ఉదయం నుండి
సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండేవారు. ఈ సంవత్సరం ఆయనకు ఆరోగ్య
సమస్యలు తలెత్తాయి. మరి
అలాంటి సందర్భంలో ఉపవాసం చేయతగునా
అని డాక్టరు గారిని అడిగారు.
ఆ డాక్టరు గారు కూడా ఇస్లాం
మతాన్ని పాటించేవారే. ఆయన నవాజ్ గారితో “చూడండి నవాజ్ గారూ,తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి
ఉపవాసం నుండి మినహాయింపు ఉంటుంది. అల్లా దయతలిస్తే వచ్చే సంవత్సరం మీరు తప్పకుండా
ఆరోగ్యవంతులు అవుతారు. అప్పుడు తప్పక ఉపవాసం
ఉందురుకాని. ” ఆ జవాబు
విన్న నవాజ్ గారి మనసుకు
స్వాంతన చేకూరింది. సరైన వైద్య సేవలు అందడం వల్ల
ఆయన త్వరలోనే కోలుకున్నారు. నెల రోజుల తర్వాత ఈద్ రోజున తన చుట్టుపక్కల ఉన్నవారందరికీ
విందు ఏర్పాటు చేసారు నవాజ్ గారు. పేదలకు ఆర్ధిక సాయం అందించారు. ఇస్లాం
మతానుసారం వారికి వచ్చిన
ఆదాయంలో కొంత శాతం పేదలకు దానం ఇవ్వాలి. నవాజ్ గారు కూడా తన
ఆదాయంలో కొంత శాతం
పేదలకు దానం చేసారు. ఏ
మతంలోనైనా మానవసేవే
మాధవ సేవ అని అందరూ
భావిస్తారు. అలాగే నవాజ్
భాయ్ అందరికీ సహాయం
చేసాడు. ఆరోగ్య పరంగా
కోలుకున్న నవాజ్ గారు
ఆ తర్వాత సంవత్సరంలో
చక్కగా ఉపవాసం ఉండి
అల్లా సేవలో తరించారు.
ఏదిఏమైనా ఈ రంజాన్
మాసంలో ముస్లిం సోదర
సోదరీమణులు భగవంతుని
సేవలో తరించి, పేదలకు సహాయం చేసి పండుగను
శ్రద్ధాశక్తులతో జరుపుకుంటారు.
-వెంకట భాను ప్రసాద్
మితృలకు రంజాన్ నెల శుభాకాంక్షలు