రంగుల ప్రపంచం
ఈ ప్రకృతి సుందరమైనది. ప్రకృతిలో గులాబీ, మల్లెపూలు,
లిల్లీ, మందారం వంటి రంగురంగుల పూలు ఉన్నాయి.
మామిడి,దానిమ్మ,యాపిల్ వంటి మధురమైన రంగురంగుల ఫలాలు కూడా ఉన్నాయి.
నెమళ్ళు,చిలకలు వంటి సుందరమైన పక్షులు కూడా
ఉన్నాయి.
చర్మంపై అందమైన చారలు
గల పులులు,లేళ్ళు మొదలైన
జంతువులు కూడా ఉన్నాయి.
సప్తవర్ణాల ఇంద్రధనుస్సును
గురించి ఎవరికయినా వర్ణించ తరమా.మన మువ్వన్నెల జండాలో ఉన్న కషాయం రంగు
త్యాగానికి చిహ్నం. అలాగే
తెలుపు రంగు శాంతికి చిహ్నం.
అలాగే ఆకుపచ్చ సమృద్ధికి
చిహ్నం. జండా మధ్యలో
నీలం రంగు గల అశోక చక్రం
ఉంది. ఆ త్రివర్ణ పతాకంలో
ఉన్న రంగులు మనకు
ప్రేరణ ఇస్తాయి. నీలం రంగు
ఆకాశం మనసుకు ఆహ్లాదాన్ని
కలిగిస్తుంది. నదులలో ప్రవహించే నీలం రంగులో ఉన్న స్వచ్ఛమైన నీరు
మనసును రంజిపజేస్తుంది.
పూర్వం నలుపు,తెలుపు
రంగులో సినిమాలు,టెలివిజన్
కార్యక్రమాలు వచ్చేవి. తర్వాత
రంగుల చలనచిత్రాలు వచ్చాయి. నాకు తెలిసి
రంగుల చలనచిత్రాలకే మొదట్లో ప్రజలంతా ఆకర్షించబడ్డారు.
నేను బొమ్మలు కూడా వేస్తుంటాను. అందువల్ల
నాకు అన్ని రంగులూ
ఇష్టమే. రంగులు లేని
ప్రపంచాన్ని మనం ఊహించలేం.
-వెంకట భానుప్రసాద్ చలసాని