రంగులవల

రంగులవల

జీవితం రంగులమయం కాదు
విధ్వంసాల వల
చెట్టు చేమ చేవచచ్చుండవు
చంపే మనిషే
నిత్యం ఛస్తూ బతుకుతుంటాడు
బతుకు బతకనివ్వమన్న
సూత్రం తెంపేస్తాడు
నిత్య దుఃఖితుడై రోదిస్తాడు
శ్రుతి లయల్లాంటి భూమ్యాకాశాలు
బోధ వింటే బాగుపడతాడేమో
అదో రంగుల కలగానే మిగులుతోంది

– సి. యస్. రాంబాబు

Related Posts