రెక్కలు
ఈ పిచ్చి లోకం నుండి , మనసు లేని రాని లోకాన్ని
కాస్త కూడా జాలి,కనీకరం లేని జనాల నుంచి
కర్కశంగా నలిపేస్తున్నా మృగాల నుంచి
బానిసత్వపు సంకెళ్ళ నుండి, దయ లెనీ మానవుల నుంచి
కనీసం తోటి మనిషి గా కూడా గుర్తించని సమాజం నుండి
మనసును తూట్లు పొడిచే మాటల నుండి
గుండెల్లో గునపాలు దించుతూ ఎద గాయాలను మళ్లీ మళ్లీ
కర్ర పెట్టీ లేపినట్టు మాట్లాడే మనసు లేని మనసుల నుండి
అసలు ఏ మాత్రం సున్నితంగా ప్రవర్తించనీ వారి నుండి
మనసుకు ,గుండెకు భరింప లేని మాటలు మాట్లాడుతూ
గేలి చేస్తూ మేము మనుషులం కాదని మరొక్కసారి గుర్తుకు తెచ్చే మనుషుల నుండి …
మానిపోయిన గాయాన్ని మరలి రెపి, బాధ పడుతుంటే వెనకాల నవ్వుతున్న నటించే మృగాల నుండి …
రెక్కలు కట్టుకుని , మరో ప్రపంచాన్ని సృష్టించుకుని మనకంటూ ఒకే ఒక లోకం లో విహరిస్తాను విహంగ లోకాన్ని
సృష్టిస్తాను మరో కొత్త లోకపు మది తలుపులను.. మరో కొత్త ఉదయాన్ని వీక్షించే నూతన ఉదయాన్ని నేనవుతాను…
-భవ్యచారు