రివెంజ్ ఆఫ్ ది సోల్ పార్ట్ 2

_రివెంజ్ ఆఫ్ ది సోల్ పార్ట్ 2

 రివెంజ్ ఆఫ్ ది సోల్ పార్ట్ 2

 

అలా సూర్య ఆ కళాశాలలో చేరి ఆనందంగా తన కొత్త స్నేహితులతో గడుపుతున్నాడు అలా రోజు రాత్రి అయ్యే సమయంలో భయానక శబ్దాలు వినిపించేవి ఆ శబ్దానికి సూర్య లేచి చూసే వాడు అక్కడ ఏమి కనిపించేది కాదు సూర్య ఉన్న రూం లో సామాన్లు శబ్దం అయ్యే సరికి సూర్య తన తోటి స్నేహితుల్ని ఎంక్వైరీ చేసి అసలు ఏమైందో తెలుసుకున్నాడు అక్కడ ఉన్న ఒక స్నేహితుడు ఆ రూం లో ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పాడు తను చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మాయి అని చెప్పాడు ఇంతకీ ఆ అమ్మాయి పేరు సంధ్య

సంధ్య వాళ్ళ నాన్న చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు ఎది అడిగితే అది చేస్తాడు అలాంటి సంధ్య కాలేజ్ లో ఒక అబ్బాయి సంధ్యని ప్రేమించాడు ఆ అబ్బాయి పేరు సతీష్ సంధ్య మొదటిలో అబ్బాయిని ప్రేమించలేదు కొన్నాళ్ళు స్నేహం చేశాక ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు ఈ విషయం
సంధ్య వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ నాన్న సతీష్ నీ చంపాడానికి ప్రయత్నిస్తాడు

సతీష్ తప్పించుకుంటాడు ఆ తర్వాత సంధ్యకి విషయం తెలుస్తుంది కొన్నాళ్లకి సంధ్య చదువు పూర్తి చేసుకుని వేరే ఊరు వెళ్తుంది అక్కడ నుంచి సతీష్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసిన సతీష్ లిఫ్ట్ చేయడు మెసేజ్ పెట్టిన సమాధానం రాదు సంధ్యకి అనుమానం వచ్చి సడెన్గా వచ్చి సతీష్ నీ చూస్తుంది అలా చూసి సంధ్య షాక్ అవుతుంది అతనికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందని తెలుసుకుని సంధ్య సతీష్ నీ చంపేస్తుంది అదే బాధతో హాస్టల్ కి వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోతుంది అని సూర్యకి తన స్నేహితుడు చెప్తాడు

ఒక రోజు రాత్రి హాస్టల్ నుంచి సూర్య సినిమా కి వెళ్లి వచ్చాక పడుకుంటాడు సడెన్గా తిరిగి చూసే సమయానికి అక్కడ సంధ్య ఆత్మ కనిపిస్తుంది అరుపులు మొదలుపెడతాడు సూర్య ఆ అరుపులకి పక్క రూం లో వాళ్ళందరూ నిద్ర లేచి వస్తారు కానీ అప్పటికే ఆ అత్మని చూసిన సూర్య గుండె ఆగి చనిపోతాడు

 -భరద్వాజ్

 

స్త్రీ  Previous post స్త్రీ 
రంజాన్  Next post రంజాన్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close