రూపం

రూపం

ఆదిదేవుడి ఆట ఈ బ్రహ్మాండ రూపం

ఈ సృష్టిలో కనబడనిది
ఆత్మ రూపం

తెలియని ప్రపంచమే ఈ
ఊహల రూపం

అమ్మ మాత్రమే ప్రేమకు
ప్రతి రూపం

మమకారపు ఆశలే
తన బిడ్డల రూపం

ఆరాదనకి సూత్రం అందమైన రూపం

మహనీయుల మార్గం
ఆదర్శానికి రూపం

ఏనాడు వీడనిది మది మెచ్చిన రూపం

కవికలం నుండిజాలువారేది
అక్షర రూపం

కళ్ళు చెదిరే అద్భుతాలు
అపురూపం

చూసే చూపులో ఉంది
మారిన రూపం

ప్రియమైన వారితో ఉండేది
ప్రేమకి రూపం

అన్నింటి కన్నా మించినది
రూపాయి రూపం

అద్దంలో కనిపించేదే
అసలైన రూపం కదా …..?

– జి జయ

Related Posts