రుణానుబంధం !

రుణానుబంధం !

అచ్చమ్మ జ్యూస్ తీసుకు అమ్మకు జూసు తీసుకురా అచ్చమ్మ అంటూ శేఖర్ పిలిచాడు ఆ వస్తున్న బాబు అలాగే తీసుకుని వస్తాను అంటూ వెళ్ళింది అచ్చమ్మ అదేంటి మీరు అందరూ అలా నిల్చున్నారు కూర్చోండి శేఖర్ మాటలు వినగానే అందరూ సోఫాలో కూర్చున్నారు అచ్చమ్మ జ్యూస్ తీసుకురాగానే తాగి గ్లాసు అచ్చమ్మ చేతికి ఇచ్చింది అక్కడ పని లేనట్టు తీసుకొని వెళ్ళింది అలా పొద్దుపోయింది మీరంతా వెళ్లి పడుకోండి సుశీల నేను కూడా అలసిపోయాను పడుకుంటాను అంది అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు

శేఖర్ నేను వేసుకునే గోలి లు ఏమైనా ఉన్నాయా అంది సుశీల లేవమ్మా ఈ రాత్రి ఇలాగే పడుకో రేపు పొద్దున టిఫిన్ చేశాక మందులు వేసుకున్నావా గాని అందరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళి నిద్ర పోయారు తెల్లారింది పొద్దున్నే నే శోభ శ్యామ్ రెడీ అయి వచ్చారు వాళ్ళు వచ్చేసరికి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా లేచి మొహం కడుక్కుని స్నానాలు చేసి రెడీగా ఉన్నారు శోభ రాగానే అరే అప్పుడే ఎంత తయారయ్యారు తయారుగా ఉన్నారా ఏమిటి టిఫిన్ చేశారా అని అడిగింది ఇంకా లేదమ్మా కాఫీ తాగి కూర్చున్నాం అచ్చమ్మ గారు అందరికీ కాఫీ ఇచ్చారు సుశీలమ్మ గారు కూడా లేచారు.

వారు కూడా పాలు తాగి కూర్చున్నారు నీ కోసమే ఎదురుచూస్తున్నారు ఆ మాట విన్న శోభ తొందరగా పైకి వెళ్లి అచ్చమ్మ తో మాట్లాడి అందరికీ టిఫిన్లు తయారుచేసింది అందరిని పిలిచి రండి రండి అందరూ టిఫిన్స్ రెడీ అయి తిందాం రండి అంటూ హడావుడి చేసింది అందరు వెళ్లి డైనింగ్ రూమలో కుర్చీలో అందరికీ టిఫిన్స్ వడ్డించింది తాను కూడా తిన్నది పూరి ఆలూ కుర్మా పచ్చడి చేసింది ఇంతలో సుశీల కూడా వచ్చింది ఆమె కూడా టిఫిన్ చేసి కూర్చున్నారు మరియు మాకు సెలవు ఇప్పించండి వెళ్లి వస్తాం అన్నాడు రఘురాం అదేంటి అప్పుడే వెళ్తారా రెండు రోజులైనా ఉండకూడదా అప్పుడే వెళ్ళిపోతాను అంటారు ఇంకా అబ్బాయికి అమ్మాయికి శోభనం జరగలేదు కదా ఆ ముచ్చట కూడా చూసి వెళ్ళండి అంది సుశీల.

ఆ మాటలు విన్న కామాక్షి అదేంటి వదినగారు మీరంతా ఉన్నారుగా ఇంకా మేమెందుకు అంది కామాక్షి. అదేమిటి వదిన గారు శోభనం అయ్యేవరకు ఉండరా కావాలంటే పిల్లల్ని పంపించండి సావిత్రికి బాబుతో కష్టంగా ఉంది. ఇంతలో శోభా అక్కడికి వచ్చి అదేమిటి వెళ్తారా మీ ఊరికి అంటూ ఉంటే ఆమె మాటలకు అడ్డు వస్తూ రఘురాం మా ముచ్చట కూడా తీరాలి కదమ్మా అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళి రెండు రోజులు ఉంచుకొని పంపిస్తాం అంటున్న రఘురాం కు అడ్డుపడుతూ ఎందుకండీ అంత తొందర మెల్లగా వెళ్ళవచ్చు లే అన్నాడు శ్యామ్. లేదండి అన్నగారు నాకేమో చేత కాదు నేను ఏ ముచ్చటా చూడలేను అందుకని వాళ్ల శోభనం ఇక్కడ జరగాలి అంది సుశీల. ఆమె మాటలకు అడ్డు చెబుతూ అదేం కాదు అబ్బాయి నీ అమ్మాయిని మేము తీసుకొని వెళ్తాము అన్నాడు రఘురాం మేము ఏమైనా మీకు లోటు చేశామా నిష్టూరకంగా అన్నాడు శేఖర్.

అది కాదు బాబు ముందుగా మా ఇంటికి రావాలి కదా అబ్బాయి అమ్మాయి అన్నాడు పురుషోత్తం. దానికి జవాబుగా లేదండి అన్నగారు నా పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడే జరగాలి వాళ్ళ శోభనం. వాళ్ల పరిస్థితి అంతా చూస్తున్న రఘురాం కామాక్షి లు సరేలే వదిన గారు చెప్పింది నిజమే తను ఎటు రాలేదు కదా వాళ్ళ శోభనం అయ్యాకనే వెళ్తాము. మన సాంప్రదాయాలు తెలుసు కదా మీకు అన్నాడు పురుషోత్తం. సాంప్రదాయాలు తెలిసినా కానీ నా సంతోషం కోసం వాళ్ళ శోభనం ఇక్కడే జరగాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుశీల.

ఆమె మాటలకు బాధ పడిన ఎలా అయితే అలాగే అయింది అని వాళ్ళు చెప్పినట్టుగానే చేయండి అన్నాడు ప్రభు. అంతేలెండి అక్కగారు వాళ్ళు ఉంటారు మేము వెళ్ళొస్తాము. పురుషోత్తం ప్రభు అన్నారు. అక్కగారు మేము పిల్లల్ని తీసుకొని వెళ్తాము అరె రఘు సావిత్రిని శ్రీను అర్జున్ బుచ్చమ్మ గంగను తీసుకొని వెళ్తాము. అర్జున్ నువ్వు కూడా వస్తావా అన్నాడు ప్రభు. నన్ను ఒంటరిగా ఇక్కడ ఉంచి మీరంతా వెళ్తారా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సిరి. సిరి ఏడవకు విశాల నీకు తోడుగా ఉంటుంది అన్నాడు అర్జున్. బెంగ పెట్టుకోకు అన్నాడు అర్జునుడు అర్జున్. ఇంతలో శ్యామ్ వచ్చి 12:00 అవుతుంది. రండి అందరం భోంచేద్దాం భోంచేశాక బయలుదేరుదురు గానీ అంటూ శోభ తొందర చేసింది.

అందరూ భోజనాలకు లేచి వెళ్తున్నారు సుశీల దగ్గరికి వచ్చి కామాక్షి సుశీల చేయి పట్టుకొని వదిన నువ్వు కూడా రా అందరం కలిసి భోజనం చేద్దాం నిన్న కూడా నువ్వు మాతో భోజనం చేయలేదు. అంటూ సుశీల చేయి పట్టుకొని కామాక్షి రామ్మా సుశీల అందరం కలిసి భోంచేద్దాం కాదనకమ్మా అంటున్న రఘురాం ను చూసి నాకు అన్న ఉంటే మీలాగే ఉండేవారు అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. రండి రండి అమ్మ నిన్ను కూడా మందులు వేసుకో లేదు తొందరగా తిందాం అంటూ శేఖర్ చక్రాల కుర్చీ లోనికి తీసుకొని వెళ్ళాడు అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. శ్యామ్ శోభ విష్ణు కూడా అందరికీ వడ్డిస్తున్నారు వాళ్ళంతా తింటుంటే సిరి మాత్రం పక్కనే నిలబడింది.

శేఖర్ తల్లి అత్తమామలతో చూసిన శ్యామ్ అరే శేఖర్ మీరంతా ఇటు రండి మీ కోసమే శిరీష గారు తినకుండా నిలబడి వున్నారు అంటూ కుర్చీల వైపు చూపిస్తూ అమ్మకు వీలుగా ఉంటుంది అనగానే ఆ వైపుకు వెళ్ళి కూర్చున్నారు అంతా.. అత్త మామ అమ్మ కూర్చున్నాక శేఖర్ పక్కనే సిరి కూర్చుంది. వారి ముందు ప్లేట్లు పెట్టింది శోభ. శోభ విష్ణు శ్యామ్ వడ్డిస్తున్నారు. నాలుగు రకాల స్వీట్స్ రెండు రకాల కూరలు పచ్చళ్ళు పాపడాలు లడ్డు ఎన్నో రకాలున్నాయి.

 

శోభ లడ్డు ని సిరి చేతికిచ్చి శేఖర్ నోట్లో పెట్టు అని అంది మొదట సిగ్గుపడుతున్న సిరి ఒకసారి విశాల వైపు చూసింది. విశాల పెట్టమన్నట్లుగా సైగ చేసింది. వెంటనే శేఖర్ నోట్లో లడ్డును పెట్టింది అంతా చప్పట్లు కొట్టారు గడుసుదానివే అంటూ శోభ సిరి బుగ్గ గిల్లింది. శేఖర్ ఊరుకుంటాడా తను కూడా ఒక లడ్డు తీసి సిరి నోట్లో పెట్టాడు. అంత లడ్డు నోట్లో పడుతుందా చిన్నగా పెట్టొచ్చుకదా అన్ని సిరి. అంతా ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. ఎలాగో తిన్నాం అని అనిపించి లేచింది సిరి అంతా తిని

చేతులు కడుక్కొని బయటకుఇ వచ్చారు మెట్లు దిగి కిందకు వెళ్లి ఎవరి రూములో వారు పడుకున్నారు పురుషోత్తం అతని భార్య అతని భార్య నాగభూషణం అతని భార్య శ్రీను సావిత్రి అర్జున్ బుచ్చమ్మ గంగా అంతా రెడీ అయి ఎదురు చూస్తూ కూర్చున్నారు ఇంతలో సుశీలమ్మ తనగదిలోకి వెళ్లి మందులు వేసుకొని మందులు వేసుకొని మంచినీళ్లు తాగి శోభ శోభ అంటూ పిలిచింది శోభ ఏంటండీ అని వచ్చింది వాళ్లకు పెట్టాలనుకున్న బట్టలు ఎక్కడ పెట్టావు తీసుకురా అంది సుశీల అలాగేనండి అంటూ బీరువాలో పెట్టిన బట్టలు బట్టలు బ్యాగులు తీసుకొచ్చి అచ్చమ్మ కు ఇచ్చింది అచ్చమ్మ ఇవన్నీ కిందికి తీసుకు వెళ్ళు వాళ్లందరికీ పెట్టాలి ఇంతలో అక్కడికి శేఖర్ వచ్చాడు ఏంటమ్మా ఇదంతా అంటూ అడిగాడు తల్లిని మీ అత్తమామలకు వచ్చిన వాళ్ళ చుట్టూ చుట్టూ పనివాళ్ళకు అందరికీ బట్టలు పెట్టాలి వెళ్దాం నన్ను తీసుకువెళ్ళు అంటూ కిందకు వచ్చారు శోభ బ్యాగులను ఒక పక్కన పెట్టిన అచ్చమ్మ ని చూస్తూ ఒక ఒక్కొక్కటిగా నాకు ఇవ్వు అంది అచ్చమ్మతో ఏమీ అనుకోకండి నేను మందులు వేసుకొని వచ్చేవరకు లేట్ అయింది.

అందరూ వరుసగా కూర్చుంటే మీ భార్యలతో అంది సుశీల అందరికీ బొట్టు పెట్టు అచ్చమ్మ అందులో ఉన్న బ్యాగులు తీసి కింద పెట్టు శోభ మీద ఉన్న పేర్ల బట్టి ఎవరి వారికి ఇవ్వు అంది సుశీల మీద రాసిన పేర్లను బట్టి చూస్తూ ఒక్కొక్కరిగా వారి చేతిలో బ్యాగులను పెడుతూ వరుసగా అందరికీ బ్యాగులను ఇచ్చి వేసింది శోభ ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అన్నాడు రఘురాం అదేంటి అన్నగారు పెళ్లి పెద్దలు మీరే మీకు పెట్టకపోతే ఇంకెవరికి పెడతాం ఏదో మాకు ఉన్న దాంట్లో పెట్టాము అబ్బాయి మంచిగానే సంపాదిస్తున్నాడు అందుకే ఇంత అంతా అనకుండా అందరికీ బట్టలు పెట్టాలని పెట్టాను ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి అంది సుశీల అలా అలా అంటావ్ ఏమిటమ్మా మేము పెళ్లికి వచ్చాము మీరు కట్నాలు పెట్టారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకంటే ఇంకేం కావాలి మాకు అబ్బాయి అమ్మాయి ఒకరికి ఒకరు తోడుగా ఉండి మిమ్మల్ని మంచిగా చూసుకొని నలుగురు పిల్లాపాపలతో సుఖంగా సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు అన్నారు అందరూ.

కామాక్షి వదినగారు అన్నగారు మీరు విశాల ఉండండి వాళ్లు వెళ్తారు మీరు రెండు రోజుల తర్వాత వెళ్దురుగాని అంది సుశీల అన్నీ వింటూ చేతులు కట్టుకుని నిలబడిన శేఖర్ కు ఇదంతా చాలా చిత్రంగా తోచింది ఏమిటో ఈ పెద్ద వాళ్ళ చాదస్తం అనుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు శేఖర్ మాకు ఎందుకండి వదిన గారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకుంటావు కదా అంది కామాక్షి ఏంటి వదిన గారు ఇది మాకు ఒక లెక్క ఇంకా మీకు ఎంతో పెట్టాలనే ఉంది ముందు ముందు మీరే చూస్తారు గా అంటూ గర్వంగా చెప్పింది సుశీల. పెద్దలకు పిల్లలకు అందరికీ ఇచ్చి అందరి ఆశీస్సులు తీసుకోండి అంది సుశీల. అందరూ కొత్త జంటను పిల్లాపాపలతో నిండు నూరేళ్లు మంచిగా ఉండండి అంటూ దీవించారు. తీసుకున్న వారంతా లేచి నిలబడ్డారు సినిమా మీ అన్న వదినలకు ఇది పెట్టు అంటూ ఇంకొక రెండు బ్యాగులు అందించింది శోభ.

శ్రీనివాస్ అర్జున్ వచ్చి కూర్చొని మీ భార్యలని పిలవండి అంటూ అలా చూస్తావేరా శేఖర్ మీ బావ గార్లకు అక్కయ్యలకు కట్నాలు పెట్టావా ఏమిటి అంది సుశీల. నాకెందుకు బావ ఇప్పుడు ఇవన్నీ అన్న శీను మాటలకు శేఖర్ అలా అనకండి బావగారు నాకు ముందు మీరు ముఖ్యం. వద్దనకూడదు రండి బాగా కూర్చొని అంటూ ఇద్దరు బావలకు బొట్టు పెట్టి బ్యాగులను అందించాడు. అలాగే సిరి కూడా వదినలకు బొట్టు పెట్టి చెరొక బ్యాగును అందించింది.

సావిత్రి ఏంటి పిన్ని గారు ఇవన్నీ అంటుంటే ఇది మన ఆచారం తల్లి బంగారమంటి పిల్లనే ఇచ్చారు ఇవన్నీ మాకు ఒక లెక్క ఇవన్నీ మా ఆనందంతో ఇస్తున్నవి కాదనకూడదు బాబుకు మంచి డ్రెస్ ఉంది వాడికి అది వేసి ఒకసారి నాకు చూపించు అంటున్న సుశీల మాట కాదనలేక బాబుకు డ్రెస్ వేసింది. వాడు చాలా చూడముచ్చటగా ఉన్నాడు అంటూ సిరి వాడిని నాకు ఇవ్వు అంది సుశీల సూటు బూటు వేసిన వాడిని చూస్తూ అందరూ ముచ్చటపడ్డారు. చాలా బాగున్నాడు సిరి బాబును ఎత్తుకొని అత్త గారికి ఇచ్చింది.

బాబు ని ఎత్తుకొని అత్తగారు మురిసిపోతూ అచ్చం దొర బిడ్డ లాగా ఉన్నాడు అంటూ ముద్దుల వర్షం కురిపించింది. నాకు ఇలాంటి మనవాడు కావాలి అంటున్న సుశీల కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అదేమిటి వదిన గారు వచ్చే సంవత్సరం వరకు మీకు మనవడు పుడతాడు బాధపడకండి అంది కామాక్షి. మీ నోటి వాక్యాన నాకు మనవడు పుడితే చాలు నీ కడుపు చల్లగుండ అంది సుశీల. పదండి టైం అవుతుంది అంటూ తొందర చేశాడు పురుషోత్తం. అలాగే వస్తున్నాం వెళ్ళొస్తామండీ పిన్ని గారు అంటూ సావిత్రి ఆమెకు నమస్కరించింది. వెళ్లొస్తామండి అత్తగారు అంటూ శ్రీను అర్జున్ లు కూడా బయలుదేరారు.

సిరి కి తోడుగా విశాల ఉండండి అంది సుశీల అలాగేనండి అంటూ అంతా బయలుదేరారు. రఘురాం కామాక్షి విశాల శోభ శ్యామ్ శేఖర్ సిరి అంతా కాదు నీ కార్లలో ఎక్కి నా కారులో కూర్చున్నాక కనుమరుగయ్యావు అంతా లోపలికి వచ్చారు సుశీల తన గదిలోకి వెళ్ళింది. మందులు వేసుకునే టైం అయింది అచ్చమ్మ నాకు మందులు ఇవ్వాలి వస్తున్నావా అంటూ పిలిచింది సుశీల. వస్తున్నా అమ్మగారు గ్యాస్ లో నీళ్లు తీసుకొని వెళ్లి మందులు ఏ టైం కి ఏది ఇవ్వాలో ఏది వేసుకోవాలి చెబుతూ ఇస్తుంది అచ్చమ్మ. మందులు వేసుకొని మంచం మీద వెనక్కు వాలి కూర్చున్న సుశీల దగ్గరికి శ్యామ్ శోభ ఇద్దరూ వచ్చి అమ్మ అని అంటున్న శ్యామ్ ని చూసి ఏమిటి అని అంది ఇంతలో శోభ ఏమీ లేదండి ఈ రాత్రికే వాళ్ళకి శోభనం చేద్దామా అనేదే నా ఆలోచన.

అదేమైనా నిన్ను అడగాలి అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు తోడుగా నిమిషాల్లో ఉంది అన్ని తెప్పించి తయారు ఉండమని చెప్పండి వాళ్లకు నీకు తెలియదా ఏమిటి అంది సుశీల మామ ఎక్కడ చేసుకుంటారో మూడు రాత్రులు అన్ని శోభాయమానంగా అలాంటివి ఏమీ లేవు ఇక్కడ జరిపించండి ఎలాగూ మూడు రాత్రులు అయినాక అక్కడికి వెళ్తారు కదా మరి వాళ్ళ ఇంట్లో ఇద్దరు అన్నలు వదినలు ఉన్నారు వారికి అక్కడ వీలుపడదు ఏమో అందుకే ఇక్కడే అంటున్నా అక్కడ వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నావ్ ఇక్కడ అయితే ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు కదా.

సిరి వాళ్ళ అమ్మమ వాళ్లకు చెబుదాం ఏమంటారో అన్నాడు శ్యామ్ లేదు శ్యామ్ వాళ్లకు కూడా ఇష్టమే మనది చాలా పెద్ద ఇల్లు అవన్నీ వాళ్లు గ్రహించే ఉంటామన్నారు అంది సుశీల. మార్గం కూడా ఒక మాట అడుగుతాను అండి శోభ సరే అడిగి చూడు మరి వాళ్ళు ఏమంటారో అంది సుశీల. కింద హాల్లో ఉన్న రఘురాం కామాక్షి లను అడిగెందుకు వెళ్లారు వాళ్ల రాక చూసి పడుకున్న రఘురాం లేచి కూర్చుని ఏంటి బాబు అన్నాడు. కామాక్షి శోభను అడిగింది సిరి విషయాలను మీరు బయటికి వెళ్ళండి ఒక చిన్న మాట ఉంది తర్వాత మీకు తెలుస్తుంది అంటూ శోభ వాళ్ళని తీసుకుని వేరే రూం లోకి వెళ్ళింది. శ్యామ్ వాళ్లకు అన్ని విషయాలు చెప్పాడు. మాదేముంది బాబు అంతా శేఖర్ వాళ్ళ అమ్మగారు ఇష్టం అన్నాడు రఘురాం కామాక్షి లు కూడా…

రూమ్ లోకి వెళ్ళిన శోభ వాళ్లకు జరిగిన విషయమంతా చెప్పారు అంతా విన్న సిరి సిగ్గుతో తలవంచుకుంది అబ్బో సిగ్గా ఇదంతా మా తమ్ముడు ముందు సిగ్గుపడు నా ముందు కాదు అంటూ విశాల శోభలు పరాచికాలు ఆడుతున్నారు. పోండి నాకు భయం వేస్తుంది మీరేమో ఆటపట్టిస్తున్నారు అంటూ బుంగమూతి పెట్టిన సిరిని చూసి వాళ్ళిద్దరు గొల్లున నవ్వారు. చాలా మా చాలు రాత్రి ఉంచుకొని సిగ్గులు బుంగమూతి అంటుంటే ముగ్గురూ కలిసి నవ్వుకున్నారు ఇంతలో శేఖర్ బయటికి వెళ్తున్నాము మాకు కాఫీ కావాలి అంటూ గట్టిగా అరిచాడు శేఖర్.

ఆ మాటలకు శోభ వెళ్లి వారికే కాకుండా అందరికీ కాఫీ కప్పులు తెచ్చింది. కాఫీ తాగాక మేము బయటకు వెళ్తున్నాను ఇంకా ఏమైనా కావాలా అంటూ ప్రశ్నించాడు ఎవరూ ఏమీ వద్దు తొందరగానే రండి మరి చీకటి అవుతుంది అని అంది శోభ. సరేలే తొందరగానే వస్తాము అన్నారు శ్యామ్ పదరా శేఖర్ అంటూ కారులో బయలుదేరారు. కామాక్షి సిరిని పిలిచి భర్త దగ్గర ఎలా మెదలాలి ఎలా ఉండాలి ఎదురు జవాబు మాట్లాడకుండా అతను చెప్పింది విను అంటూ హితబోధ చేసింది కూతురికి. అన్నీ విన్న సిరి అమ్మ నేను చదువుకున్న నాకు అన్నీ తెలుసు ఎలా ఉండకూడదు ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్తే కానీ తెలుసుకొలేని దాన్ని కాదు నాకు అన్నీ తెలుసు లేవే అంది సిరి. అది కాదు తల్లి పెద్దలు ఊరికే ఏమీ చెప్పరు అన్నీ మనమంచికే చెబుతారు అది గుర్తుంచుకో అంటుంది కామాక్షి.

ఇంతలో శోభ విశాల వచ్చి వాళ్ళు వచ్చారు సిరి నువ్వు వెళ్లి స్నానం చేసి రా అంది శోభ. ఇప్పుడు వద్దులే భోజనాలు అయినాక చేస్తాను అని సిరి సరే శేఖర్ తల్లి రూమ్ లో ఉన్నారు ఏదో మాట్లాడుతున్నారు విశాల శోభ ఇద్దరూ వంటగదిలోకి వెళ్లి చూసి అందరికీ సరిపోతుందా ఇంకా వంట చేసేది ఏమైనా ఉందా అనేది చూశారు . తర్వాత అచ్చమ్మను పిలిచి శేఖర్ గారు రూమ్ ను శుభ్రంగా ఊడ్చి అన్నీ మంచిగా సర్దు. అక్కడ కుర్చీలో కొత్త చెద్దర్ ఉంది దాని పరుపు మీద పరువు అంటుంటే అలాగే అమ్మా అంటూ అక్కడి నుండే శేఖర్ బాబు గదిలోకి వెళ్ళింది. వాళ్ళు తెచ్చిన పూలు పండ్లు అన్నీ ప్లేట్లలో చదువుతున్నారు స్వీట్ కూడా ప్లేట్ లో పెట్టి ఇంకా వన్ రూమ్ లో అలంకరించాలి విశాల పద పద అంటూ అచ్చమ్మనీ తీసుకెళ్ళింది.

వాళ్ళు లోపలికి వెళ్లేసరికి శ్యామ్ డెకరేషన్ చేస్తున్నాడు. చుట్టూ మల్లెలు వేసి మధ్యలో లవ్ సింబల్ గులాబీలను పెట్టాడు శ్యామ్. మంచం చుట్టూ మల్లెలను వేలాడదీశాడు అగరవత్తుల స్టాండ్బై అగరబత్తులు పెట్టాడు. మూలన నిలబడి ఇదంతా చూస్తున్న అచ్చమ్మ కి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంది. అది చూసి శోభా ఏవండీ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు అంటూ ప్రశ్నించింది. నీ దగ్గరే నేర్చుకున్నా నువ్వు మొదటి రాత్రి ఇలాగే చేశావు కదా ఏంటో ఎలా ఉంది నా అలంకరణ అంటూ చిన్నగా కన్ను గీటుతో అడిగాడు.

చాల్లెండి మీకు ఈ మధ్య దూకుడుతనం ఎక్కువ అయింది అంటూ ముసిముసిగా నవ్వుకుంది శోభ. విశాల చూసావా ఎంత బాగా అలంకరించాడో చూడు అంది. నిజంగానే బాగుంది శ్యామ్ గారు చాలా బాగా అలంకరించారు మేము కూడా ఇలా చేయలేము అంది. ఏమనుకున్నా రండి నా టేస్ట్ వేరే గా ఉంటది అంటూ గర్వంగా చెప్పాడు శ్యామ్. అచ్చమ్మ కు ఏమి మాట్లాడాలో తెలియక అలాగే సైలెంట్ గా నిలబడి ఉంది. అంతా బాగానే చేశారండీ తలుపులు పెట్టేద్దాం భోజనాలయ్యాక వాళ్ళను పంపేటప్పుడు తీద్దాం అంటూ శోభ హడావిడి చేసింది. అందరూ బయటకు రాగానే తలుపులు వేసి గడియ పెట్టేసింది విశాల. అవును ఇంతలో అందరం భోజనాలు చేద్దాం అప్పుడే 8:00 అయింది.

పంతులు గారు 8:30 కి ముహూర్తము అన్నారు కదా. శోభ శ్యామ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ మెట్లు దిగుతున్నారు. అచ్చమ్మ పైనే ఉంది అందరికీ వడ్డించటానికి నేను వారితో పాటే మెట్టు దిగాను. శోభ శ్యామ్ లు సరాసరి వారిద్దరూ సుశీలమ్మ గదికి వెళ్లారు. విశాల అత్త మామ సిరులున్న గది కి వెళ్ళింది ఏమిటి విశాల పైన ఏం చేశారు అంటూ అక్కడ జరిగిన విషయం అంతా చెప్పింది విశాల. మామగారు కూడా నిజంగా మన సిరి అదృష్టవంతురాలు దానికి ఇలా రాసిపెట్టి ఉంది అంతా దేవుడి దయ అన్నాడు చేతులెత్తి భగవంతుడికి నమస్కరిస్తూ.

అవునండి దానికి రాసిపెట్టి ఉంటాడు ఆ దేవుడు అన్ని మంచి జరుగుతున్నాయి అని కామాక్షి. ఇంతలో పిన్ని గారు బాబాయ్ గారు రండి అందరం భోజనం చేద్దాము అప్పుడు 8:15 అయితుంది ఇంకా పావుగంట ఉంది రండి రండి అందరం భోజనం చేద్దాము అంటూ శోభ పరుగులాంటి నడకతో వెళ్ళింది. విను పైకి వెళ్ళే సరికి అంతా రెడీగా ఉన్నారు అచ్చమ్మ అందరికీ వడ్డించ సాగింది మీరు మెల్లగా తినండి మేము తొందరగా తింటాము అంది శోభ. రా విశాల మనం తొందరగా తిందాం మనకు చాలా పనులు ఉన్నాయి అంది శోభ. అందరూ తొందరగా తొందరగా తింటున్నారు శేఖర్ శ్యామ్ సుశీలమ్మ మాట్లాడుకుంటూ తింటున్నారు శేఖర్ పక్కనే సిరి తల్లిదండ్రులు ఉన్నారు.

ఈ మాట ఆ మాట మాట్లాడుకుంటున్నారు సిరికి సిగ్గు ముంచుకొస్తోంది. అన్నాన్ని గెలుకుతూ కూర్చుంది అది చూసిన సుశీలా అదేమిటమ్మా అలా అన్నాన్ని గెలుకుతున్నావు తిను కడుపు నిండ తింటే మంచిది. సిరి వైపు చూస్తున్న శేఖర్ మంచిగా తిను ఈరోజు రాత్రి నాతో పోటీకి దిగవా ఇలా తింటే త్వరగా అలసిపోతావు అంటూ చేవి దగ్గర గుసగుసగా అన్నాడు. తినకపోతే వదలరని గ్రహించిన సిరి చక్కగా కలుపుకొని టినసాగింది. ఇంతలో శోభ, విశాల చెయ్యి కడిగేసుకొని శేఖర్ గది వైపు వెళ్తూ వారు తయారు చేసిన ప్లేట్స్ తీసుకొనివెళ్ళారు తల్లీ తండ్రీ అన్నీ చూస్తూ మౌనంగా ఉన్నారు ఏది జరిగినా మన మంచికే అంటారు కదా ఇది అలాంటిదేనేమో అనుకున్నారు రఘురాం కామాక్షిలు. తినడం అయిపోయాక అచ్చమ్మ పెద్ద గ్లాసు నిండా పాలు వేడి చేసి పెట్టు అంది సుశీల.

అన్ని చూస్తున్న అచ్చమ్మకు అంతా అర్థం అయ్యి రెడీగా ఉంచాను అమ్మగారు అంది. తల్లిని గదిలోకి తీసుకెళ్లాడు శేఖర్, శ్యామ్. వదిన మీరు కూడా రండి అంది సుశీల వారి వెనకాలే రఘురాం కామాక్షి సిరి కూడా వెళ్లారు కూర్చొని అన్నగారు వదిన కూర్చోండి అని అంటుంటే ఆమె మంచానికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. అమ్మ సిరి త్వరగా స్నానం చేసి రా అరేయ్ శేఖర్ నువ్వు కూడా అంది సుశీల శేఖర్ పైకి వెళ్ళాడు. సిరి ఇక్కడే బాత్రూంలో చేయి అన్నీ అక్కడే ఉన్నాయి అని అత్తగారు సరే అని తల ఊపి వెళ్లి బాత్రూంలో స్నానం చేసింది బాత్ రూమ్ చాలా పెద్దగా ఉంది అక్కడ చీర లంగా జాకెట్ అన్ని రెడీగా ఉన్నాయి అంతా చిత్రంగా ఉంది అనుకుంది సిరి మనసులో.

అక్కడున్న బట్టలు వేసుకొని బయటికి వచ్చేసరికి అక్కడ శేఖర్ శ్యాం శోభ విశాల అమ్మానాన్నలు అంతా ఉన్నారు. వాళ్ళందరిని చూసి కొంచెం సిగ్గు పడుతున్న సిరిని దాచుకో నీ సిగ్గు ఇంకా కొన్ని నిమిషాలే పో వదినా నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అంటున్న సిరి ని చూసి చాలెండి మీ వదిన మరదలు సరసాలు చాలా టైం అవుతుంది తొందరగా రెడీ అయితే అబ్బాయి కి పాలు పట్టుకెళ్ళాలి కానివ్వండి అంది పెద్దగా ఉన్న తన జుట్టును పాయలుగా తీసి జడ వేసి మల్లెపూలు పెట్టుకుని పౌడర్ రాసుకుని రెడీ అయిన సిరిని చూసి నా కోడలు లక్ష్మీదేవిలా ఉంది అంటూ సుశీల మురిసిపోయింది. పెద్ద వాళ్ళందరి కాళ్లకు దండం పెట్టి నిలబడిన సిరిని దీవిస్తూ శుభం తల్లి వచ్చే సంవత్సరం వరకు నాకు చేతిలో మనవాడు కావాలి అన్ని సుశీల.

అంతలో శేఖర్ తన గదిలోకి వెళ్ళాడు శ్యామ్ దోస శేఖర్కు అమ్మాయిని బెదిరించే చేయకు మర్యాదగా అని చెప్పి వేరే రూంలోకి వెళ్ళాడు ఇంతలో శోభ విశాల సిరి చేతికి పాల గ్లాస్ ఇచ్చి శేఖర్ రూమ్ ముందు నిలబెట్టారు. వెల్ లోనికి అంటూ మెల్లిగా తోసి తలుపులు వేశారు వేసిన తలుపుల వెనక నిలబడి ఉన్న శేఖర్ వచ్చి ఆమెను చేయి పట్టుకొని మంచం వరకు తీసుకుని వెళ్లి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ అందుకొని టేబుల్ మీద పెట్టి సిరిని చేయి పట్టుకొని మంచం పై కూర్చోబెట్టి శిరీష గారు చెప్పండి ఏమిటి విషయాలు అంటూ ఆమె తొడపై తల పెట్టి పడుకున్నాడు.

గడసరి అయినా సిరి ఏం లేదు మాట్లాడటానికి ముందు మీరు ఆ పాలు తాగండి అంది శేఖర్ లేచి గ్లాస్ తీసుకొని సగం పాలు తాగి మిగతావి సిరికి ఇస్తూ నాలోని సగం మీరు కూడా తాగండి అండ్ గ్లాస్ చేతికి ఇచ్చాడు మిగతా సగం సిరి తాగి ఈరోజు నుండి ఇద్దరం చెరో సగం కదా అంటూ చిరునవ్వు నవ్వి ఆమె బుగ్గను ముద్దాడాడు. సిరి చంపడం తుడుచుకుంటూ చీ పొండి అంది అదేంటి పొమ్మంటున్నారు పోవాలా బయటకు వెళ్ళి తలుపు గడియ పెట్టి వచ్చింది పోవడానికి కాదు అన్నీ సగం సగం పంచుకోవాలనే ఈ గదిలో మనల్ని వదిలారు మరి అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు.

అయ్యో లైట్ ఉంది అంటే నోటి మీద ముద్దు పెట్టి లైట్ ఆర్పి ఇద్దరూ వేగంగా కొట్టుకుంటున్న వారి గుండె చప్పుడును ఒకటి చేశారు. తెనాలి వరకు ఇద్దరికీ జాగారమే అయింది అలసిపోయి మూడు గంటలకు నిద్ర పోయారు ఇద్దరు తెల్లారింది అంతా లేచి టీలు కాఫీలు తాగి స్నానాలు చేసి శేఖర్ సిరిల కోసం ఎదురుచూస్తున్నారు. మెల్లిగా ఏడు గంటలకు మెలకువ వచ్చిన వారిద్దరికీ రాత్రి సంగతి గుర్తుకు వచ్చి ఇద్దరూ ముఖాలు చూసుకుని నవ్వుకుంటూ లేచి బాత్ రూం లోకి వెళ్లి స్నానం మొఖం అన్ని పనులు చేసుకుని వేరే బట్టలు మార్చుకొని వచ్చేసరికి అంతా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు.

వాళ్ళను చూసి సిగ్గుపడుతూ మెలుకువ రాలేదు సార్ ఈ అందరికీ ఆకలిగా ఉంది టిఫిన్ ఏమిటి అంటూ సిరి ఇలా వచ్చి కూర్చో అన్నాడు శేఖర్. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుంటే శోభ ఇద్దరికీ టిఫిన్స్ పెట్టింది కాఫీలు తాగిన తరువాత సిరి విశాల గదిలోకి వెళ్ళింది. అంతవరకు ఎవరంటే ఎవరు ఏమి మాట్లాడకుండా ఊరుకుంటారు వెనకాలే వెళ్ళిన విశాల మంచంపై అడ్డంగా పడుకున్న సిరి ని చూస్తూ దగ్గరగా వచ్చి అమ్మ దొంగ రాత్రి బాగా నిద్ర పోయారు అనుకుంటా అంటూ పలకరించింది విషాద ఎక్కడ వదిన నన్ను నిద్ర వస్తే కదా అందుకే శేఖర్ మంచివాడే కదా అన్ని విషయాలు అన్ని ఆరాలు తీస్తారు అంటూ పక్కకు తిరిగి పడుకుంటాడు కాసేపు అంటూ కళ్లు మూసుకుంది ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు దగ్గర చదువు అని మాట్లాడిన తరువాత సరే పడుకో అంటూ తను లేచి తలుపు దగ్గరగా వేసి బయటికి వెళ్ళింది విశాల.

తండ్రి అయిన తర్వాత విశాల వచ్చి సిరి సిరి భోజనాలకు కూర్చున్నారు కదా అంటూ లేపింది విశాల కావలించుకుటూ లేచి ఏంటి వదిన అప్పుడే అంటుంటే ఒకటిన్నర అయింది ఇక చాలు నిద్రపో వెళ్లి ముఖం కడుక్కుని రా అంతా నీకోసం వెయిటింగ్ అన్ని విషయాల నా కోసమా కళ్ళు పెద్దవి చేసి చూసింది వదిన వైపు అవును నువ్వు లేనిదే శేఖర్ తినడట మరి వెళ్ళు వెళ్ళు తొందరగా మొహం కడుక్కుని రా అంది విశాల. తక్కువ బాత్రూం లోకి చేరిన కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి ఇద్దరూ కలిసి డైనింగ్ రూమ్ లోకి వెళ్లారు రండి రండి మీ కోసమే వెయిటింగ్ అన్న శేఖర్ మాటలకు అంతా నవ్వుకున్నారు. సిరివాటి శేఖర్ పక్కనే కూర్చుంది విశాల శోభ వడ్డించ సాగారు అచ్చమ్మ అందరికీ నీళ్లు గ్లాసు లో పో. అందరూ తింటున్నారు మా భోజనాలు అయినట్లే మీరు కూడా భోజనం చేయండి తొందరగా ఇప్పటికే లేటయ్యింది అంటున్న సుశీల చెయ్యి కడిగేసింది.

అచ్చమ్మ నన్ను రూం లోకి తీసుకు వెళ్ళు అంటూ ఏమనుకోకండి నేను వెళ్తున్నా అంటూ సుశీల వెళ్ళింది తన గదిలోకి. అమ్మగారిని మంచంపై కూర్చోబెట్టిన అచ్చమ్మ నువ్వు తినేసి రా మందులు ఉద్యోగాన్ని అన్ని సుశీల సరే అమ్మ అంటే అచ్చం వచ్చేసరికి అంతా లేచారు శోభా విశాల వడ్డించుకుంటున్నారు అచ్చమ్మ రండి మీ కోసమే చూస్తున్నాము అంటూ పిలిచారు ఇద్దరు. తిన్న తర్వాత అచ్చమ్మ అన్నీ సర్ది నేను అమ్మగారికి మందులు ఇచ్చి వస్తాను అంటూ వెళ్ళింది. ముందు గదిలో శేఖర్, శ్యామ్ రఘురాం ఏదో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. శోభ, విశాల, సిరి ఒక గదిలో పడుకున్నారు.

అలా మూడు రాత్రులు గడిచాయి .

నాలుగోరోజు అర్జున్ వచ్చాడు. కామాక్షి వెళ్లి పడుకున్న విశాలని లేపుతుంది. విశాల ఏమిటి ఈ నిద్ర అర్జున్ వచ్చాడు లే. లేచి మొఖం కడుక్కో వెళ్దాం అంటున్నారు అంది. అక్కడే ఉన్న సిరి ఏమిటి అన్నయ్య వచ్చాడా అంది. అవునే మేము వెళ్దామని అనుకుంటున్నాము తల్లిని చూసి సిరి అప్పుడు వెళ్తారా నేను అర్జున్ అన్నయ్యను అడుగుతాను అంటూ లేచి బాత్ రూం లోకి వెళ్లి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది. విశాల శోభలు కూడా బయటికి వచ్చారు అందరు కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళారు రఘురాం అర్జున్ కూర్చుని

కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు. విశాల్ నన్ను చూస్తూనే అర్జున్ దగ్గరగా వచ్చి విశాల తొందరగా రెడీ అవ్వు వెళ్లాలి పాస్పోర్ట్ లు వచ్చాయి వీసాలు కూడా వచ్చాయి మనం ఎల్లుండి అమెరికా వెళ్ళేది. అని అంటున్న అర్జున్ ను చూసి ఇంత తొందరగా వచ్చాయా అని అడిగి ఆశ్చర్యపోయింది. శోభ వంటగది వైపు వెళ్ళింది అదేమిట్రా అన్నయ్య అమెరికా వెళ్తారా మీరు అవును అక్క మా కంపెనీ మేనేజర్ తొందరగా రమ్మని మెయిల్ చేశాడు పాస్పోర్టు వీసాలు కూడా వచ్చాయి మంచి ఉద్యోగం తప్పదు వెళ్ళాలి అన్నాడు అర్జున్. ఇంతలో అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది శోభ అక్కడ ఉన్న సుశీల ఇంకొక రెండు రోజులు ఉంటారు అనుకున్నా అదేమిటి బాబు వెళ్ళావా అమ్మ నాన్నలను కూడా తీసుకువెళతాను అక్కడ ఇంట్లో కొట్టిన ఒకటే ఉంటుంది అన్నయ్య కూడా లేడు ఇంక వారం తర్వాత అన్నయ్య తన ఉద్యోగం గురించి ఇక్కడికే వస్తారు వాడికి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయింది అంటున్న అర్జున్తో శేఖర్ భోజనం చేసి వెళ్ళండి అన్నాడు.

లేదు బావ ఇంకా చీకటి అవుతుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి వెళ్ళాలి తొందరగా అంటే కనీసం టిఫిన్స్ అయినా చేయండి అంది సుశీల. శోభ వారికి ఉప్మా చేసి ప్లేట్స్ లో పెట్టి తీసుకొని వచ్చింది ఇక వాళ్ళకి తినక తప్పలేదు. రఘురాం కామాక్షి విశాల అర్జున్ అంత ఉప్మా తిని కాఫీ తాగి కూర్చున్నారు . విశాల వెళ్లి గదిలో ఉన్న అత్తగారి బ్యాగు తన బ్యాగు తెచ్చింది సిరిని దగ్గరికి తీసుకుంటూ కామాక్షి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. విశాల వస్తావు సిరి అంటే చిన్న పిల్లల అందరి ముందు ఏడుస్తున్న చూసి శిరీష నువ్వు చాలా గట్టి దాని వెనుకున్న ఇలా చేస్తావని అనుకోలేదు చిన్నపిల్లల ఏడుస్తున్నావు అన్నాడు శేఖర్ వారిస్తూ….

వదిన గారు మీ అమ్మాయి కాదు ఇప్పుడు మా ఇంటి పిల్ల మేము బిడ్డ కంటే ఎక్కువగా చూస్తుంటాము బాధపడకండి అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్ళండి పెద్దబ్బాయి ఇక్కడే ఉద్యోగం కదా వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా ఇక నీకేం కాదు మీ తల్లి గారి ఇల్లు అనుకో నీకు నేను చూడాలి అనిపించినప్పుడు వాడు తీసుకెళ్తాడు లే అంది సుశీల. ఆమె మాటలు వింటున్న అందరూ చాలా సంతోషించారు ఇంకా వెల్లోస్తాము అండి బావ గారు సిరి జాగ్రత్తగా ఉండు అంటున్న అర్జున్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అలాగే అన్నయ్యా అంటూ సిరి కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంది అంత వరకు వెళ్లి కారు కనుమరుగు అయ్యేవరకు చూసి లోనికి వచ్చారు.

కార్ లో బయలుదేరి రెండు గంటల ప్రయాణం తరువాత కాకినాడ చేరుకున్నారు రాత్రి 12 అయింది ఎవరింటికి వాళ్ళు వెళ్లారు ఇంట్లోకి కాదు ఇంటిముందు ఆగగానే సావిత్రి వచ్చి తలుపు తెరిచి అదేంటి సిరా లేదా అంతా కలిసి వస్తావు అనుకున్నాను అంది బాబును భుజాన వేసుకుంటూ…. వాళ్ళు రాలేదు అంటూ కామాక్షి ఇంట్లోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కుర్చీలో కూర్చుంది. అందులో సావిత్రి మంచి నీళ్ళు తెచ్చి అత్తగారికి ఇచ్చింది ఆమె నీళ్లు తాగి చెంబు కింద పెడుతూ జరిగిన ముచ్చట్లు చెప్పసాగింది కొడలుకు. అత్తగారు కుర్చీలోనే ఉంటుంది శ్యాం శోభ వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అక్కడ ఇంట్లో ఉండేది అచ్చమ్మ ఇంట్లో అన్ని పనులు ఆమెని చూస్తే అది ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు కదా తల్లిని వదిలి ఎలా వస్తారు వచ్చిన వాళ్ల ఇంట్లో ఉన్న అన్ని సౌకర్యాలు మన ఇంట్లో లేవు కదా.

కాస్త నిష్టూరంగా ఉంది కామాక్షి పోనీ లేవే ఎలాగైనా అమ్మాయి పెళ్లి బాగానే జరిగింది అన్నాడు రఘురాం మంచి నీళ్లు తాగుతూ. అంతా మంచే జరిగింది కదా ఇంక మీకు బెంగ ఎందుకు అన్నాడు శ్రీనివాస్ సరేలే పడుకోండి చాలా పనులు ఉన్నాయి అంటూ అర్జున్ విశాల రూములోకి వెళ్లారు. రఘు రామ్ మేజిక్ కాముడు పడుకుందాము చాలా రాత్రి అయింది ఏదైనా ఉంటే రేవు మాట్లాడుకుందాము అంటూ గదిలోకి వెళ్ళాడు అతని వెనకే కామాక్షి వెళ్ళింది. సావిత్రి బాబు ని తీసుకొని శ్రీనుతో వాళ్ళ గదిలోకి వెళ్ళింది అంతా పడుకున్నారు. తెల్లారింది అర్జున్ విశాల ఇద్దరు అమెరికాకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ సావిత్రి హైదరాబాద్ కి రెడీ అవుతున్నారు అత్తగారికి మామగారికి కాఫీలు తెచ్చి ఇచ్చింది సావిత్రి.

బాబు లేచాడా సావిత్రి అడిగింది అత్త గారు అప్పుడే లేచాడు ఆడుకుంటున్నారు అని సావిత్రి రెడీగా ఉంటుంది స్నానం చేసి వచ్చి కుర్చీలో వాడు ఇంతలో నాన్న గారు నాన్నగారు మేము అమెరికాకు బయలుదేరుతున్నాం రెండు గంటలకు మాకు హైదరాబాదులో విమానం ఉంటుంది అన్నాడు ఇంతలో పురుషోత్తం వచ్చి ఏమిరా అర్జున్ ఇంకా ఇక్కడే ఉన్నావా బయలుదేరావా అనుకున్నాను అంటూ శీను సావిత్రి మీరు కూడా హైదరాబాద్ వెళతారు కదా అక్కడ నా ఫ్రెండు ఇల్లు ఉంది కొద్దిరోజులు ఉండండి తర్వాత వేరే ఇల్లు చూసుకోవచ్చు మీరు అనగా పురుషోత్తం అలాగే మామ అంటున్న శ్రీను ను చూసి రేపు వెళ్ళవచ్చు కదా మీరు అన్నాడు రఘురాం.

లేదు నాన్నా సెలవులు అయిపోయాయి వెళ్లాలి తప్పదు అన్నాడు శ్రీనివాస్ వెళ్ళనివ్వరా రఘు వాళ్ళ జీవితాలకి సంబంధించినది మరి వాళ్ళ జీవితాలు చూసుకోవాలి కదా మనది అంతా అయిపోయింది ఇన్ని రోజులు అమ్మాయి పెళ్లి అని దిగులు పడ్డావు అని తీరింది ఇక వీళ్లు అంటావా మగపిల్లలు వస్తుంటారు పోతుంటారు అర్జున్ కంటే దూరం కానీ శనివారం వస్తూ ఉంటారు కదా ఇంకా ఎందుకు బెంగ నీకు ఎప్పుడు చూడాలని ఉన్నా అల్లుడి వచ్చి తీసుకొని వెళ్తారు ఇంకేంటి రా నీది పురుషోత్తం రఘు అన్న మాటలు ఇలా ఉన్నాయి.

అదేమిటి రా నాకెందుకు బెంగ బిడ్డను కన్న వారిని చదివించాను పెళ్లిళ్లు చేశాము వారి బ్రతుకు తెరువు చూపించాము ఆశపడకుండా వారి సంపాదన వారికి జీవిత పాఠాలు నేర్పుతుంది అన్న రఘు మాటలకు కామాక్షి ఎందుకండీ బాధపడతారు వారికి జీవితాన్ని ఇచ్చాము వారి బ్రతుకులు వారే బ్రతకనీ మంచిచెడ్డలను వారే తెలుసుకుంటారు వాళ్ళు మంచి గా ఉంటేనే కదా మనము సంతోష పడేది మీరు ఎవరి కొడుకు అని ఎవరు అడిగినా అలగడం కొడుకులను అంటూ గర్వంగా చెప్పుకుంటారు అది చాలదని మనకు ఇంకేమి కావాలి అంది ఈ రోజు తో మన బంధాలు తీరాయి ఇక మనం నిశ్చింతగా ఉందాము అంటుందా కామాక్షి మాటలకు పురుషోత్తం నాకు కూడా గర్వంగా ఉంది చెల్లెమ్మా మంచి మాట చెప్పావు మనకు బంధం తీరింది అన్నాడు పురుషోత్తం కూడా. అంతా భోజనాలు చేసిన తర్వాత పురుషోత్తం కు మామ వెళ్లోస్తాము అన్నారు శ్రీను అర్జున్.

సరే ఇక నేను కూడా వెళ్తాను రా అంటూ వెళ్లిపోయాడు పురుషోత్తం. పెద్దోడు భార్యను తీసుకొని హైదరాబాద్ వెళ్ళాడు. అర్జున్ విశాల అమెరికా వెళ్లారు. ఇంట్లో ఉన్నది రఘురాం, కామాక్షి ఇద్దరే…. ఆలా పది సంవత్సరాలు గడిచాయి. మధ్య మధ్యలో ఉత్తరాలు రాస్తున్న అర్జున్ ఇద్దరు కొడుకులు పుట్టారని రాశాడు. శ్రీనివాస్ కు ఇద్దరు కొడుకులు పుట్టారు అని తెలిసింది. ఆ తర్వాత శిరీష కు ఒక బాబు ఒక పాప పుట్టారు. సుశీల మనవడిని మనవరాలిని చూసుకొని కొద్ది రోజులు బ్రతికి ఆవిడ ఈ మధ్యే కాలం చేసింది. శ్రీను కు ఇద్దరు కొడుకులు అర్జున్ కి ఇద్దరు కొడుకులు మొత్తం నలుగురు.

తప్పకుండా నా మనవళ్ళు నా పేరు నిలబెడతారే కాముడు అంటూ కళ్లద్దాలు తీసి పంచతో తుడుచుకొని మళ్లీ అద్దాలు పెట్టుకుంటూ తమ్ముడు కాస్త కాఫీ పెడతావు వణుకుతున్న గొంతుతో అడిగిన భర్తను చూసి తన ప్రక్కనే ఉన్న చేయు మిషన్ తీసుకొని పెట్టుకుంటూ ఏమిటి అంటున్నారు అంది కామాక్షి. కాఫీ కావాలంటుంది అవును కదూ అదేనండి అంటూ అక్కడే ఉన్న కాఫీ మేకర్ లో పాలు పోసి కాఫీ పొడి వేసి కొంచెం వేడి అవగానే రెండు కప్పుల పాలు తాగుతూ హైదరాబాద్ నుండి శ్రీను పంపినది కాఫీ ఈజీగా చేయవచ్చని తెచ్చారు కదా అందులోనే చేస్తాను అంటూ గట్టిగా అరిచింది కామాక్షి. ఏమిటి అడగడం వినపడని నీకు నాకు కాదు అంటూ రఘురాం ఏనాటిదో ఈ బంధము మనం అందరి రుణం తీర్చుకున్నాం అన్నాడు రఘురాం.

అయిపోయింది.

 

-కే .శారదా దేవి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress