సాగాల్సిందే

సాగాల్సిందే

ఆశలన్ని ఆవిరవుతున్నా
గమ్యం చేరాల్సిందే
గెలుపు గుర్రం చతికిలబడినా
బుజ్జగించి ముందుకు సాగాల్సిందే

పోరాటమంటేనే జీవితంతో కలబడి
నిలబడటం
పగలూ రేయి వలయంలో చిక్కుబడక
పయనం సాగాలి

అలసట బాటలో
జ్ఞాపకాలను గుబాళించనీ
పారేనదిలా ఉరకలెత్తావంటే
స్నేహపరిమళాలను పంచుతావు

కదంతొక్కుతూ పదం పాడవోయ్
కదిలే ఉత్సాహమై
కదిపే తరంగమై
వెరుపేలేని వీరుడవై స్ఫూర్తిని పంచుతావు

– సి.యస్.రాంబాబు

Related Posts